తెలంగాణ

telangana

ETV Bharat / international

నైజీరియా, బ్రెజిల్, గయానాలో మోదీ పర్యటన - జీ20లో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని ఆకాంక్ష

నైజీరియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ - బ్రెజిల్​లో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొననున్న పీఎం

PM Narendra Modi
PM Narendra Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Modi Visit To Nigeria : మూడు దేశాల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నైజీరియా బయలుదేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నైజీరియా రాజధాని అబుజాకు వెళ్లారు. ఈ పర్యటనలో నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్​ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చిస్తారు. ఆ తరువాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. అనంతరం ఈ నెల 19న మోదీ గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్​ ఇర్ఫాన్​ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్​ ఆఫ్​ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది.

అర్థవంతమైన చర్చల కోసం..
బ్రెజిల్​లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో అర్థవంతమైన చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైజీరియా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది భారత్​ జీ-20 సదస్సుకు అధ్యక్ష స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

"బ్రెజిల్​లో జరిగే 19వ జీ-20 సదస్సుకు నేను హాజరవుతాను. గత సంవత్సరం భారత్​ తన విజయవంతమైన ప్రెసిడెన్సీలో జీ-20 కూటమిని పీపుల్స్​ జీ-20గా మార్చింది. అలాగే గ్లోబల్ సౌత్​ ప్రాధాన్యాన్ని జీ-20 అజెండాలోకి తీసుకువచ్చింది" అని మోదీ అన్నారు.

నవంబర్​ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. అంటే గతేడాదిలో భారత్​లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్​లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది. ఒక దేశం మరొక దేశానికి తన లెగసీని ట్రాన్స్​ఫర్ చేస్తుంది కనుక ఈ మూడు దేశాలను ట్రోకా కంట్రీస్​గా పేర్కొంటారు.

ABOUT THE AUTHOR

...view details