Sudan Paramilitary Attack :సుడాన్ ఓమ్‌దుర్మాన్ నగరంలోని ఓపెన్ మార్కెట్‌పై పారామిలిటరీ గ్రూపు శనివారం జరిపిన దాడిలో 54మంది మృతి చెందగా, మరో 158 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు సుడాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సూడాన్‌లోని ఓపెన్ మార్కెట్‌పై పారామిలిటరీ గ్రూప్ దాడి- 54 మంది మృతి - SUDAN ATTACK
సుడాన్లో పారామిలిటరీ గ్యాంగ్ కాల్పులు- 54 మంది మృతి, 158 మందికి తీవ్రగాయాలు
Sudan (Source : Associated Press (Representative Image))
Published : Feb 1, 2025, 8:47 PM IST
దేశ సైన్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ పారామిలిటరీ గ్రూపు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుడాన్ అధికారిక ప్రతినిధి ఖలీద్ అల్ అలీసర్ ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలాగే ఈ దాడిలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.