Pakistani Boat Accident : పాకిస్థాన్‌లో రంజాన్ వేళ వరుస విషాదాలు నెలకొన్నాయి. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేకమంది మరణించగా, తాజాగా జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 15మంది గల్లంతయ్యారు. గురువారం ఖైబర్ పంఖ్త్వునా ప్రావిన్స్‌లో నౌషారా జిల్లాలోని సింధు నదిలో ఓ పడవ బోల్తా పడింది. రంజాన్ వేడుకను పురస్కరించుకుని భారీ సంఖ్యలో ప్రజలు రావడం వల్ల ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 11 మందిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రంజాన్ వేళ పాకిస్థాన్‌లో మరో విషాదం- పడవ బోల్తా పడి 15మంది గల్లంతు! - Pakistani Boat Accident - PAKISTANI BOAT ACCIDENT
Pakistani Boat Accident : పాకిస్థాన్‌లో జరిగిన పడవ ప్రమాదంలో 15మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి 11 మందిని రక్షించారు.
Published : Apr 11, 2024, 10:24 PM IST
|Updated : Apr 11, 2024, 10:46 PM IST
రోడ్డు ప్రమాదంలో 17మంది మృతి
అంతకుముందు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కరాచీలోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బోట్-నౌక ఢీ, 8మంది మృతి
దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్‌లోని నైరుతి తీరంలో ఫిషింగ్ బోట్, వాణిజ్య నౌక ఢీకొన్న ప్రమాదంలో తప్పిపోయిన 8మంది మృతి చెందినట్లు చైనా అధికారులు ధృవీకరించారు. ఏప్రిల్ 3న అర్ధరాత్రి వేళ సన్యా తీరానికి పశ్చిమాన 60 నాటికళ్ల మైళ్ల దూరంలో ఫిషింగ్ బోటు, కంటైనర్లు తరలించే వాణిజ్య నౌక ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫిషింగ్ బోటు సముద్రంలో మునగడం వల్ల అందులోని 8 మంది గల్లంతయినట్లు పేర్కొన్నారు. గల్లంతయినవారు మృతి చెందినట్లు ధృవీకరించిన అధికారులు వారి మృతదేహాలను సముద్రం నుంచి బుధవారం వెలికి తీశారు. ఈ గాలింపు చర్యల్లో 140 రెస్క్యూ నావలు, 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుమారు 13 వేల మంది సిబ్బంది పాల్గొన్నట్లు చైనా అధికారులు తెలిపారు. మొత్తం 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు