Kuwait Fire Accident Indians :కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రితి వర్దన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకు కువైట్ చేరుకున్న ఆయన, ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చే చర్యలను పర్యవేక్షించనున్నారు.
కువైట్‌లో సజీవదహనమైనవారి భౌతిక కాయాలకు అక్కడి అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. DNA పరీక్షల తర్వాత భారతీయులను మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది.
మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా
కువైట్‌లోని అల్-మాంగాఫ్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 42 మంది భారతీయులేనని తెలుస్తోంది. మిగిలినవారు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాలీ వాసులని సమాచారం. ఇది చాలా విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని మోదీ, కేంద్రం తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కువైట్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా పంపే ఏర్పాటు చేయాలని కోరారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
24మంది కేరళ వాసులు మృతి
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కేరళ వాసుల సంఖ్య 24కు పెరిగింది. మరో ఏడుగురు కేరళవాసులు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దేశ, విదేశాల్లో ఉండే కేరళ వాసుల సంక్షేమం కోసం 1996లో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్‌రెసిడెంట్ కేరలైట్స్ ఎఫైర్స్-N.O.R.K.A” సంస్థ కువైట్ ఘటన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది. N.O.R.K.A ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయంతో సమన్వయం చేసుకుంటోంది. అక్కడ మృతిచెందిన కేరళ వాసుల మృతదేహాలను తెచ్చేందుకు అవసరమైన పత్రాలు నింపేందుకు సహకరిస్తోంది.
బాధితులకు కేరళ ప్రభుత్వం ఆర్థిక సాయం
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రివర్గం, మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. క్షతగాత్రలకు లక్షచొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళ ఆరోగ్యమంత్రి