Kailash Mansarovar Yatra To Resume :కైలాస-మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని భారత్, చైనాలు సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీతో భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
కైలాస-మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం- భారత్-చైనా కీలక నిర్ణయం - KAILASH MANSAROVAR YATRA TO RESUME
ఈ వేసవిలో మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం- ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ - భారత్, చైనా నిర్ణయం!
Kailash Mansarovar Yatra (ETV Bharat)
Published : Jan 27, 2025, 10:24 PM IST
కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు పర్యటనలను కొవిడ్ నేపథ్యంలో 2020లో నిలిపివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది మోదీ, షీ జిన్‌పింగ్‌లు రష్యాలోని కజాన్‌లో జరిగిన భేటీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమమైంది.