డొనాల్డ్ ట్రంప్ 'హష్ మనీ' కేసు- న్యాయస్థానం కీలక తీర్పు - TRUMP HUSH MONEY CASE VERDICT
హష్ మనీ కేసులో కీలక తీర్పు- తొలి అమెరికా అధ్యక్షుడిగా మిగిలిన ట్రంప్
Published : Jan 10, 2025, 9:58 PM IST
Trump Hush Money Case Verdict :అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన హష్ మనీ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ, ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. దీంతో దోషిగా నిర్ధరణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు.