తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ దాడి- 14 మంది పాలస్తీనీయన్లు మృతి- వారికి అగ్రరాజ్యం భారీ ఆర్థిక సాయం - Israel Attack On Gaza - ISRAEL ATTACK ON GAZA

Israel Attack On Gaza : వెస్ట్ బ్యాంక్​లోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 14మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాదాపు 24 గంటల పాటు ఈ దాడి జరిగిందని పేర్కొంది. మరోవైపు అమెరికా హెచ్చరిస్తున్న రఫా నగరంపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో వైమానిక దాడుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:09 AM IST

Updated : Apr 21, 2024, 7:25 AM IST

Israel Attack On Gaza :అమెరికా వద్దని హెచ్చరిస్తున్నా రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడులు చేపట్టింది. వెస్ట్​ బ్యాంక్​లో ఉన్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 14 మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడిలో గాయపడిన వారిని తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్​ మరణించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు దాదాపు 24 గంటలకు పైగా దాడి చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

పాలస్తీనా నగరమైన తుల్కర్మ్​కు సమీపంలో ఉన్న నూర్​ షామ్స్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడిని ప్రారంభించాయని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. దాదాపు 24 గంటలు అంటే శనివారం వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాయని పేర్కొంది. ఈ దాడిలో మరణించిన వారిలో ఓ బాలుడు, ఒక యువకుడు ఉన్నారని చెప్పింది. గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ డ్రైవర్​ మహ్మద్​ అవద్ అల్లా మూసా(50)ను ఇజ్రాయెల్ సైన్యం చంపినట్లు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. ఇలా అంబులెన్స్​లు, వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే వెస్ట్ బ్యాంక్​లో తమ సైన్యం జరిపిన దాడిలో 10మంది పాలస్తీనా ముష్కరులు మరణించారని, నలుగురు సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ శుక్రవారం తెలిపింది.

రఫాపై దాడి 9 మంది మృతి
మరోవైపు శుక్రవారం రాత్రి ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాజాకు దక్షిణాన, ఈజిప్టునకు సమీపంలో ఉన్న ఈ నగరంలో దాదాపు 12 లక్షలకు పైగా పాలస్తీనియన్లు తలదాచుకుంటున్నారు. ఇందులో చాలా మంది ఇజ్రాయెల్‌ దాడి కారణంగా ఉత్తరగాజా, మధ్య గాజాను వదిలి వచ్చిన వారే అధికమని అధికారులు వెల్లడించారు. ఈ నగరంపై దాడి చేస్తే అతి పెద్ద మానవ సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు.

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ సాయం
మరోవైపు యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లకు అమెరికా భారీ ఆర్థిక సాయం అందించనుంది. శనివారం జరిగిన అమెరికా ప్రతినిధుల సభలో 95 బిలియన్‌ డాలర్ల సాయానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చేతులు కలిపారు. ఉక్రెయిన్‌కు 61 బిలియన్‌ డాలర్లు, ఇజ్రాయెల్‌కు 26 బిలియన్‌ డాలర్లను మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందజేయనుంది.

ఇరాక్​లోని సైనిక స్థావరాలపై దాడులు! అవి ఆటబొమ్మలంటూ ఇజ్రాయెల్‌ను హేళన చేసిన ఇరాన్‌ - Bombing At Iraq Military Base

ఇరాన్​లో భారీ శబ్దంతో పేలుడు- ఎయిర్​ ఢిపెన్స్ అలర్ట్​- ఇజ్రాయెల్​ ప్రతీకార దాడి! - Iran Israel War

Last Updated : Apr 21, 2024, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details