India China Diplomatic Meet :సరిహద్దులో శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూడడమే ప్రధాన అజెండాగా భారత్, చైనా దౌత్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు నియంత్రణ చర్యలు కొనసాగించాలని తీర్మానించాయి. గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కుదిరిన బలగాల ఉపసంహరణ ఒడంబడిక అమలుపై రెండు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దిల్లీలో జరిగిన చర్చల అనంతరం భారత విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది.
భారత్, చైనా మధ్య దౌత్య చర్చలు- సరిహద్దులో శాంతిపై ఏకాభిప్రాయం - INDIA CHINA DIPLOMATIC MEET
భారత్, చైనా మధ్య దౌత్యచర్చలు- సరిహద్దుల్లో పరిస్థితులపై సమీక్ష
India China Diplomatic Meet (Source: Getty Image, ANI)
Published : Dec 5, 2024, 7:50 PM IST
2020లో జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలపై భారత్, చైనా ప్రతినిధులు చర్చించారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్షించారు. శాంతియుత వాతావరణం కొనసాగాలే చూడడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని తీర్మానించారు. ఈ చర్చలకు కొనసాగింపుగా భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది.