తెలంగాణ

telangana

ETV Bharat / international

హెజ్‌బొల్లాకు మరో గట్టి ఎదురుదెబ్బ - ఇజ్రాయెల్ దాడిలో ప్రధాన ప్రతినిధి హతం! - HEZBOLLAH MAIN SPOKESMAN KILLED

సెంట్రల్​ బీరుట్​పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి - హెజ్‌బొల్లా మెయిన్​ స్పోక్స్​మ్యాన్​ మహమ్మద్‌ అఫిఫ్‌ మృతి

Israel Hezbollah war
Israel Hezbollah war (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 10:14 PM IST

Hezbollah Main Spokesman killed : హెజ్‌బొల్లాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో హెజ్‌బొల్లా ప్రధాన ప్రతినిధి (మెయిన్ స్పోక్స్​మ్యాన్​) మహమ్మద్‌ అఫిఫ్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సెంట్రల్‌ బీరుట్‌పై టెల్‌అవీవ్‌ సేనలు దాడి చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అనేక సంవత్సరాలుగా మహమ్మద్‌ అఫిఫ్‌ - హెజ్‌బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేయడం సహా, సంస్థ అధిపతి హసన్‌ నస్రల్లాను హతమార్చడం లాంటి కీలక పరిణామాల అనంతరం బాహ్యప్రపంచంలో అఫిఫ్​ ఎక్కువగా కనిపించారు. ఇదిలా ఉండగా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. లెబనాన్‌ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

గాజాలో 12 మంది మృతి
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 12 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.

నెతన్యాహు ఇంటిపై దాడి
అంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్‌ సిజేరియా పట్టణంలోని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. రెండు ఫ్లాష్‌ బాంబులతో దాడి చేయగా, అవి నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశామని, షిన్‌ బెట్‌తో కలిసి నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details