తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ మరో వార్నింగ్​! అమెరికా నుంచి గ్యాస్, ఆయిల్​ కొనకపోతే ట్యాక్స్ రివెంజ్ పక్కా​!! - TRUMP ON TARRIFFS

అమెరికా నుంచే గ్యాస్‌, చమురు కొనాలంటున్న డొనాల్డ్​ ట్రంప్‌

Trump On Tarriffs
Trump On Tarriffs (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Trump On Tarriffs :అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోతోపాటు పలు దేశాలపై టారిఫ్‌లు పెంచుతానని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ను కూడా ఆ జాబితాలో చేర్చారు. వాషింగ్టన్‌తో వాణిజ్య అంతరాన్ని తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. గ్యాస్‌, ఇంధనాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకుంటే అన్ని టారిఫ్‌లను పెంచేస్తామని హెచ్చరించారు.

అమెరికా-ఈయూ మధ్య భారీగా వాణిజ్య అంతరం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో గణాంకాల ప్రకారం, ఈయూ-అమెరికా మధ్య 202.5 బి.డాలర్ల వాణిజ్య అంతరం ఉన్నట్లు తెలిసింది. ఆ ఏడాది ఈయూ నుంచి 553 బి.డాలర్లు ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోగా, 350.8బి.డాలర్ల ఉత్పత్తులను ఈయూకు ఎగుమతులు చేసింది. ఈ అంతరాన్ని త్వరితగతిన తగ్గించాలన్నారు.

గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈయూతో వాణిజ్య అంతరాన్ని ట్రంప్‌ ప్రధానంగా ప్రస్తావించారు. దీనిని మెరుగుపరుకోవాలన్నారు. లేదంటే, నాటోకు అదనంగా ఇస్తోన్న నిధులను నిలిపివేస్తామని, యూరప్‌ కూడా సహకరించాలన్నారు. ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దాదాపు తొలిరోజు 50 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు సమాచారం.

ఇటీవల, అమెరికా ఉత్పత్తులపై న్యూదిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు ట్రంప్. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ మళ్లీ హెచ్చరికలు చేశారు. "అమెరికా ఉత్పత్తులపై భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నాయి. 100, 200శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్‌ 100 శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలుచేయడం అనేది వారి ఇష్టమే. కానీ, మేం కూడా అలాగే స్పందిస్తాం" అని ట్రంప్‌ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details