Jimmy Carter Funeral : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జార్జియాలో జనవరి 4న ప్రారంభమై జనవరి 9తో ముగియనున్నాయి. ఆయన పార్థfవ దేహాన్ని జార్జియా, వాషింగ్టన్ డీసీ తదితర ప్రాంతాలకు ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లనున్నారు.
జనవరి 4 (శనివారం)
జార్జియాలోని ఫోబ్ సమ్టర్ మెడికల్ సెంటర్‌కు శనివారం ఉదయం 10.15 గంటలకు కార్టర్ కుటుంబం రాకతో అంత్యక్రియ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుత, మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కార్టర్ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలోకి(మోటార్ కేడ్) తీసుకెళ్తారు. ఈ వాహనం కార్టర్ స్వస్థలమైన జార్జియాలోని ప్లెయిన్స్‌కు వెళ్తుంది. ఉదయం 10.50 గంటలకు కార్టర్ కుటుంబం తాలూక పొలం దగ్గర కాసేపు ఆగుతుంది. అప్పుడు నేషనల్ పార్క్ సర్వీస్ చారిత్రక ఫామ్ బెల్‌ను 39 సార్లు మోగిస్తుంది. ఆ తరువాత తిరిగి అట్లాంటాకు మోటర్ కేడ్ ఉదయం 10.55 గంటలకు బయలుదేరుతుంది. ఇది మధ్యాహ్నం 3 గంటలకు జార్జియా స్టేట్ క్యాపిటల్ వద్ద ఆగుతుంది. కార్టర్ ప్రెసిడెన్షియల్ సెంటర్ వద్ద కార్టర్ భౌతిక కాయానికి పలువురు సంతాపం తెలియజేస్తారు. జనవరి 5, 6వ తేదీన కార్టర్ భౌతికకాయం అక్కడే ఉంటుంది.