తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా మాజీ అధ్యక్షుడుకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిన బిల్‌ క్లింటన్‌ - BILL CLINTON HOSPITALIZED

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అస్వస్థత

Former US President Bill Clinton
Former US President Bill Clinton (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2024, 7:54 AM IST

Bill Clinton Hospitalized :అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్లు క్లింటన్‌ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

బిల్‌ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. క్రిస్మస్ నాటికి ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బిల్ క్లింటన్.

అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) సేవలందించారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడం వల్ల ఆయనకు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడం వల్ల తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య వచ్చి మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమొక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details