Democratic National Convention Joe Biden: అమెరికాలో రాజకీయహింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో నాయకత్వ బాధ్యతలను అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా అమెరికా ఐ లవ్ యూ అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కుటుంబ సమేతంగా హాజరైన బైడెన్ మధ్యలో భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థులు తమ నామినేషన్‌ను అంగీకరిస్తూ సమావేశం చివరి రోజు మాట్లాడే ఆనవాయితీని బ్రేక్ చేస్తూ హారిస్ తొలి రోజే మాట్లాడారు.
కమలా హారిస్‌కు బాధ్యతలు అప్పగించిన బైడెన్ (Associated Press) డెమొక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో బైడెన్, కమలా హారిస్ (Associated Press) ఇక అమెరికాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కమలా హారిస్‌కు ఓటు వేయాలని జో బైడెన్ ప్రజలను కోరారు. "మేము దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేశాం. జీవన ప్రమాణాలను పెంచాం. 2020లో ప్రజాస్వామాన్ని కాపాడం. మళ్లీ ఇప్పుడు అదే పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికా భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉంది. ఇక ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా మన చిన్నారులు తుపాకులకు బలవుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే కమలా, నేను తుపాకుల చట్టాన్ని తెచ్చాం. ఆ విషయంలో మేము గర్వపడతాం. ఇక మారుణాయుధాలను నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది" అని బైడెన్ అన్నారు. ముందుగా జో బైడెన్ వేదికపైకి రాగానే డెమొక్రటిక్ పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు ఎమోషనల్ స్టాండింగ్ ఒవేషన్ లభించింది. వి లవ్ జో అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
పార్టీ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తున్న బైడెన్ (Associated Press) కంటతడి పెట్టిన బైడెన్
డెమొక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌కు కుటుంబసమేతంగా జో బైడెన్ హాజరయ్యారు. తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని, మహిళలకు విలువనివ్వడం, నమ్మడం చూసినట్లు ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ చెప్పగానే ఆమె మాటలకు బైడెన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆయన పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు.
డెమొక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో కమలా హారిస్ (Associated Press) పార్టీ కన్వెన్షన్‌లో బైడెన్ కంటతడి (Associated Press) 'అందరం కలిసి పోరాడితేనే విజయం'
ఈ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితం మొత్తాన్ని దేశ సేవకు అంకితం చేశారని కొనియాడారు. అమెరికాకు చారిత్రక నాయకత్వం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. "దేశంలోని నలుమూలల నుంచి ఈ సదస్సుకు వచ్చారు. అన్నివర్గాల ప్రజలు ఇందులో ఉన్నారు. అందరం కలిసికట్టుగా పోరాడితేనే విజయం వరిస్తుంది. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో అదే జరగనుంది. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ దిశగా తీర్పునివ్వాలి" అని కమలా హారిస్ ప్రజలకు పిలుపునిచ్చారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు తమ నామినేషన్‌ను అంగీకరిస్తూ సమావేశాల చివరి రోజు మాట్లాడడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ హారిస్ తొలిరోజే మాట్లాడారు.
'కమలకు ఆ అనుభవం ఉంది'
మరోవైపు అమెరికాను ముందుకు నడిపించే సామర్థ్యం, అనుభవం కమలా హారిస్‌కు ఉందని ఆ దేశ మాజీ విదేశాంగ శాఖ మంత్రి, ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ అన్నారు. 'కమల గురించి నాకు పూర్తిగా తెలుసు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆమె వంతు కృషి చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అబార్షన్ హక్కుపై చట్టం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడతారు' అని అన్నారు.
'సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేస్తాం' - కమలా హారిస్ హామీ - Kamala Harris Election Pledges
'ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా- నియంతల కంటే దేశం గొప్పది' - ట్రంప్‌నకు జో బైడెన్ చురక! - US Elections 2024