Tibet Earthquake Death Toll : నేపాల్-టిబెట్ సరిహద్దులను వణికించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 126మంది మృతిచెందినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ పేర్కొంది. మరో 188 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని జిగాజ్ నగరంలో మంగళవారం ఉదయం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పశ్చిమ చైనాలో, నేపాల్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ రీజియన్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ తెలిపింది.
నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కి.మీ దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
China earthquake (Associated Press) పశ్చిమ చైనాలో, నేపాల్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ రీజియన్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ తెలిపింది. ఖుంబు హిమాలయ శ్రేణిలో లోబుట్సేకు 90 కి.మీ దూరంలో ఉన్న చైనాలోని టింగ్రి కౌంటీలోని జిజాంగ్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భారత్, అమెరికాలు ఈ భూకంప తీవ్రతను 7.1గా పేర్కొన్నాయి.
నేపాల్‌ను వణికించిన భూకంపం
నేపాల్‌లో మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4, 5 తీవ్రతతో కనీసం అరడజను సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.
భారత్‌లోనూ భూప్రకంపనలు
ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. దిల్లీ-ఎన్‌సీఆర్, బంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.
నేపాల్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్‌లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.