తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం- 44 ఏళ్లలో తొలిసారి ఇలా! - China Ballistic Missile Launch - CHINA BALLISTIC MISSILE LAUNCH

China Ballistic Missile Launch : చైనా అత్యంత శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. పసిఫిక్‌ సముద్రంలోని లక్ష్యాన్ని ఇది ఛేదించినట్లు మొదటిసారిగా బహిరంగంగా పేర్కొంది.

China Ballistic Missile Launch
China Ballistic Missile Launch (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 11:49 AM IST

China Ballistic Missile Launch :పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతగా పరీక్షించింది. పీఎల్‌ఏ రాకెట్‌ ఫోర్స్‌ ఈ ఖండాంతర క్షిపణి డమ్మీ వార్‌హెడ్‌ను అమర్చి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.44కు ప్రయోగించినట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఖండాంతర క్షిపణి ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి విజయవంతంగా చేరుకుందని తెలిపింది.

'ఈ ప్రయోగం మా దళాల శిక్షణ, ఆయుధశక్తి, నిర్ణీత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. మా వార్షిక శిక్షణలో భాగంగా ఇది సాధారణంగా జరిగే విషయమే. ఖండాంతర క్షిపణి ప్రయోగంపై సంబంధింత దేశాలకు ముందే సమాచారం అందించాం. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ ప్రయోగం జరిగింది. ఏ దేశానికి వ్యతిరేకంగా నిర్దేశించినది కాదు' అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో చెప్పింది.

44 ఏళ్ల తర్వాత
చైనా 44 ఏళ్లలో సముద్రంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. 1980లో మొదటిసారి ప్రయోగించింది. అప్పటి నుంచి అణ్వాయుధ పరీక్షలు భూఉపరితలం పైకి నిర్వహించేది. ఇక ఈ నెల ప్రారంభంలోనే ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇటీవల కాలంలో ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో క్షిపణి కార్యకలాపాలు ఊపందుకున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం చైనా దగ్గర అణుసామర్థ్యాలు స్థాయికి మించే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చైనా మాత్రం తొలుత అణ్వస్త్రాల వినియోగానికి తాము వ్యతిరేకమని పేర్కొంది.

2000 కిలోలను మోసుకెళ్లే చైనా డ్రోన్ - ఆ విషయంలో డ్రాగన్​ జెట్​ స్పీడ్​!
Heavy Lift Drone China : డ్రోన్ల విషయంలో శరవేగంగా చైనా పురోగతి సాధిస్తోంది. సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారు చేసిన అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను ఇటీవల పరీక్షించింది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్‌ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ఆ డ్రోన్​ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. పూర్తి వివరాలు కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details