తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి- ఇరాన్​పై IDF ఆరోపణలు - BOMB ATTACK ON NETHANYAHU HOUSE

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి - నెతన్యాహు ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో బాంబులు పడినట్లు గుర్తింపు

BOMB ATTACK ON NETHANYAHU HOUSE
BOMB ATTACK ON NETHANYAHU HOUSE (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 8:02 AM IST

Updated : Nov 17, 2024, 8:43 AM IST

Bomb Attack On Nethanyahu House :ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై శనివారం బాంబుల దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో రెండు బాంబులు పడినట్లు గుర్తించారు. దాడి సమయంలో నెతన్యాహు గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరని తెలుస్తోంది. నెతన్యాహుకు ప్రమాదం తప్పినట్లు సమాచారం.

ఈ బాంబు దాడులపై ఇజ్రాయెల్​ ప్రభుత్వం స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. హద్దులను దాటుతున్నారంటూ టెల్‌అవీవ్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, గత నెలలో కూడా నెతన్యాహు ఇంటిపై డ్రోన్‌ దాడులు జరిగాయి.

Last Updated : Nov 17, 2024, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details