Biden Allows Ukraine To Use Range Missiles : రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూ భాగంపై దాడికి వినియోగించేందుకు కీవ్‌కు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మాస్కోపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం దొరికింది. ఉత్తర కొరియా సైన్యం సాయంతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు రష్యా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లాంగ్ రేంజ్ క్షిపణులను ఉక్రెయిన్ ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా పశ్చిమ దేశాలతో పాటు జెలెన్స్కీ కూడా బైడెన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాంటి అయుధాలను వాడకుండా నిషేదం విధించడం వల్ల తమ నగరాలు, విద్యుత్ గ్రిడ్లపై పుతిన్ సేనలు చేసే దాడులను అడ్డుకోలేక పోతున్నట్లు బైడెన్‌తో చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మార్చేలా అమెరికా కీలక నిర్ణయం- ఇక పుతిన్‌కు కష్టాలు తప్పవా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ గతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు ఓ బైడెన్ కీలక నిర్ణయం - రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేలా ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతి
Biden Allows Ukraine To Use Range Missiles (Associated Press, ANI)
Published : 4 hours ago
|Updated : 4 hours ago
మరోవైపు బైడెన్ నిర్ణయాన్ని, ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ఇప్పటికే పుతిన్ సేనలను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్, దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాకు కొంతమేర ఇబ్బందులు కలగవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బైడెన్ చేసిన ఈ ప్రకటనపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు.
Last Updated : 4 hours ago