Man Killed Brother-in-Law in Rangareddy : పరామర్శించేందుకు వచ్చిన బామ్మర్దితో బావ గొడవకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగిళ్ల ప్రాంతానికి చెందిన యాదయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత పది సంవత్సరాల క్రితం నిద్రలో ఉన్న భార్యను క్రూరంగా తల నరికి హత్య చేశాడు. దీంతో ఆయనకు జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. చర్లపల్లి జైలులో ఆరు సంవత్సరాల శిక్షకాలం పూర్తి చేసుకున్నాడు బావ యాదయ్య.
మానసిక పరిస్థిలో బాలేక 3 సంవత్సరాలు చికిత్స : తర్వాత అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మూడు సంవత్సరాలు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకున్న తర్వాత యాదయ్య తన మానసిక పరిస్థితిపై కోర్టులో అప్పీలు చేసుకుని శిక్ష కాలాన్ని పూర్తి చేసుకొని 2013లో విడుదలై సొంత గ్రామంలోని నాగిళ్లలో జీవనం సాగిస్తున్నాడు.
ఆదివారం గ్రామంలో జరిగిన ఒక విందులో పాల్గొనడానికి వచ్చిన బామ్మర్ది శ్రీను, బావ యాదయ్యను పరామర్శించడానికి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఒకరిపై ఒకరు దాడికి చేసుకుని మృతి చెందారు. గ్రామ మాజీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ జగదీశ్ తెలిపారు. యాదయ్య మానసిక పరిస్థితి సరిగా లేకపోడంతో యాదయ్యనే మొదటగా దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
భార్యపై అనుమానంతో హత్య - ఆపై అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన భర్త
కూతురిని చంపేందుకు ప్రయత్నం : ఇదిలా ఉండగా గత సంవత్సరం యాదయ్య పెద్దకూతురు పుష్పలత తండ్రిని పరామర్శించేందుకు వెళ్లగా తనపై కూడా దాడి చేశాడని, గొడ్డలితో నరికి హత్య చేసేందుకు ప్రయత్నించే క్రమంలో తన భుజానికి తీవ్ర గాయమై తప్పించుకుని పారిపోయిందని మృతుడు యాదయ్య చిన్న కూతురు తెలిపారు.
మృతదేహాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో : కాగా మృతుడు యాదయ్య గ్రామంలో అందరితో దురుసుగా ప్రవర్తించేవాడని యాదయ్య మృతదేహాన్ని పిల్లలు బంధువులు ఎవరూ తీసుకెళ్లలేదు. మరోవైపు గ్రామస్థులు వారి గ్రామానికి తీసుకురావద్దని కోరడంతో కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ స్మశాన వాటికకు తరలించి దహన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
'నన్నే అంత మాట అంటావా?' - అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకుని మరీ హత్య
ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని కక్ష - యువతి తండ్రిపై ప్రేమోన్మాది కాల్పులు