ETV Bharat / entertainment

కూతురు కోసం నయనతార యుద్ధం - లేడీ సూపర్ స్టార్​ కొత్త సినిమా టైటిల్ టీజర్ చూశారా? - NAYANTHARA NEW MOVIE TITLE RAKKAYIE

నయనతార పుట్టిన రోజు సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నటిస్తోన్న కొత్త సినిమాను ప్రకటించిన మేకర్స్​.

Nayanthara New Movie Title Rakkayie
Nayanthara New Movie Title Rakkayie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 11:13 AM IST

Updated : Nov 18, 2024, 11:30 AM IST

Nayanthara New Movie Title Rakkayie : ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోన్న హీరోయిన్ నయనతార పుట్టిన రోజు నాడు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నయనతార. రక్కయీ అనే కొత్త సినిమాను ప్రకటించింది. సెంథిల్‌ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఈ వివరాలను తెలుపుతూ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్​. డ్రమ్ స్టిక్స్‌ ప్రోడక్షన్‌, మూవీ వర్స్‌ఇండియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార కూతరు కోసం యుద్ధం చేసే శక్తి మంతమైన తల్లిపాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో నయన్​ నటించిన ఆ పవర్‌ఫుల్‌ టైటిల్‌ టీజర్‌ను మీరూ చూసేయండి.

కాగా, టైటిల్ టీజర్ చూస్తే చిత్రంలో నయనతారది పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ఓ చిన్న పాపకి పాలు పడుతూ సాధారణ గృహిణిలా టీజర్ ప్రారంభంలో కనిపించింది నయన్. ఈ క్రమంలోనే చాలా మంది కత్తులు, కాగడాలతో ఆమె ఇంటి పైకి దాడికి రావడం, నయనతార కూడా ఆ తర్వాత సీరియస్ అండ్ రగ్డ్​ యాక్షన్ మోడ్​లోకి వచ్చి, కొడవళ్లతో యుద్ధానికి దిగడం చూపించారు. ఇంకా టీజర్​లో నయనతార కట్టూ బొట్టూ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రచార చిత్రంలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం పవర్​ ప్యాక్డ్​లా ఉండేలా కట్ చేశారు మేకర్స్​. మొత్తానికి ఈ టీజర్​తో లేడీస్ సూపర్ స్టార్ ఫ్యాన్స్​కు అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

ఇకపోతే ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. గౌతం రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను తెలుపనున్నారు.

ఫ్యామిలీతో కలిసి దిల్లీకి - నయనతార తన పుట్టినరోజు సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని కుతుబ్ మినార్​ను కుటంబంతో కలిసి సందర్శించింది. భర్త విగ్నేష్ శివన్​తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి కుతుబ్ మినార్ దగ్గర సందడి చేసింది.

మరోవైపు ప్రస్తుతం నయనతార, హీరో ధనుశ్​పై చేసిన విమర్శలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్​గా మారింది. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ విషయంలో ఈ వివాదం తలెత్తింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది.

'అసలు అప్పుడు ఏం జరిగింది?' - నయన్, ధనుశ్ కాంట్రవర్సీ డాక్యుమెంటరీ రివ్యూ

స్టార్ హీరోలపై మీనాక్షి చౌదరి కామెంట్స్​ - ఏమన్నారంటే?

Last Updated : Nov 18, 2024, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.