తెలంగాణ

telangana

ETV Bharat / international

మొన్న అలా, నేడు ఇలా- ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారా? - BARACK OBAMA DIVORCE

ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం

Barack Obama Divorce
Barack Obama, Michelle Obama (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 1:32 PM IST

Barack Obama Divorce :అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ జీవితానికీ సమ ప్రాధాన్యమిస్తూ మోస్ట్‌ పాపులర్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకుని ఎంతో అన్యోన్యంగా ఉండే ఒబామా దంపతులు త్వరలో విడాకులు తీసుకోకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఒబామా హాజరుకానుండగా ఆయన సతీమణి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, అందువల్లే ఆ కార్యక్రమానికి మిచెల్‌ ఒబామా హాజరు కావడం లేదని ఊహాగానాలు ఇప్పుడు జోరందుకున్నాయి.

ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి ఒబామా రాగా, మిచెల్ మాత్రం హాజరుకాలేదు. దీంతో ఒబామా దంపతులు విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అయితే 2000లోనే బరాక్‌ ఒబామాకు తాను విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు 2012లో విడుదలైన ఓ పుస్తకంలో మిచెల్​ పేర్కొన్నారు.

కాగా, మిచెల్, ఒబామాది ప్రేమ వివాహం. ఒబామా హార్వర్డ్‌ లా స్కూల్‌లో సమ్మర్‌ ఇంటర్న్‌గా చేరిన సమయంలో మిచెల్​ను చూసి పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. మిచెల్‌కు కూడా ఒబామాపై ఇష్టమున్నా తన మనసులోనే దాచుకుందే తప్ప బయటికి చెప్పలేదు. తొలి డేట్‌లో భాగంగా సినిమాకు వెళ్లిన ఈ జంట మధ్య అన్యోన్యత రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో మిచెల్‌ మనసులో తనపై ఉన్న ఫీలింగ్‌ ఏంటో తెలుసుకోవాలనుకున్న ఒబామా, ఇద్దరూ తరచూ వెళ్లే రెస్టారంట్‌లో ప్రత్యేక సర్‌ప్రైజ్‌ ఏర్పాటు చేశారు. డెజర్ట్‌ ట్రేలో ఉంగరాన్ని ఉంచి ప్రేమ ప్రతిపాదన చేశారు.

అలా మిచెల్ వెంటనే ఓకే చెప్పగా 1991లో నిశ్చితార్థం చేసుకుంది ఆ జంట. 1992లో పెళి చేసుకుంది. ఒబామా- మిచెల్ వివాహ బంధానికి గుర్తుగా సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో బరాక్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు తాము కౌన్సెలింగ్‌ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్‌ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details