Biden Letter For Trump :అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న వేళ ఓ విషయం ఆసక్తికరంగా మారింది. పదవి నుంచి వైదొలిగే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడి కోసం ఓ 'అభినందన లేఖ'ను కార్యాలయ డెస్కుపై (Oval Office) పెట్టి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. రొనాల్డ్ రీగన్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయం డొనాల్డ్ ట్రంప్ హయాం వరకు కొనసాగింది. ఒకవేళ జో బైడెన్ కూడా అటువంటి లేఖ ట్రంప్ కోసం రాస్తే, ఒకరి గురించి మరొకరు లేఖ రాసుకున్న తొలి సంఘటనగా ఇది నిలవనుంది.
అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ రెండు పర్యయాలు (1981-89) పనిచేశారు. అనంతరం 1989లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌కు ఆయన అభినందనలు తెలుపుతూ ఓ సందేశాన్ని అధ్యక్ష కార్యాలయం (ఓవల్ ఆఫీస్) టేబుల్‌పై పెట్టి వెళ్లారు. గతంలో తనతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకోవడమే కాకుండా, కొన్ని కీలకమైన సూచనలను కూడా ఆ లేఖలో రాశారు.
అనంతరం జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్‌కు అటువంటి నోట్ రాసి పెట్టారు. క్లింటన్ కూడా తదుపరి అధ్యక్షుడు జార్జ్ బుష్ (జూనియర్)కు, బుష్ సైతం ఒబామాకు, ఒబామా కూడా ట్రంప్‌నకు ఈ తరహాలోనే అభినందన లేఖలను రాశారు. ఈ విధంగా గత అధ్యక్షులు అందరూ తమకు ఎదురైన సవాళ్లు, విమర్శలు, సూచనలతో, కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే సంప్రదాయం కొనసాగించారు.