తెలంగాణ

telangana

ETV Bharat / international

1994లో హత్య- రింగ్​కు ఉన్న వెంట్రుకతో కేసు ఛేదించిన పోలీసులు- సందీప్​కు యావజ్జీవ జైలు! - లండన్​లో మహిళ హత్య కేసు

30 Years Old Murder Solved In UK : 30 ఏళ్ల క్రితం ఓ మహిళను హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి లండన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆధునిక సాంకేతిక సాయంతో ఈ 30 ఏళ్ల నాటి హత్య కేసును లండన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.

30 Years Old Murder Solved In UK
30 Years Old Murder Solved in UK

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 6:59 AM IST

30 Years Old Murder Solved In UK : 30 ఏళ్ల నాటి హత్య కేసులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి లండన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అది కూడా ఫోరెన్సిక్‌ శాస్త్రంలో పురోగతి వల్లే ఈ హత్య కేసును లండన్‌ పోలీసులు విజయవంతంగా ఛేదించగలిగారు. హంతకుడు భారత సంతతికి చెందిన సందీప్‌ పటేల్‌ కాగా, బాధితురాలు మరీనా కోపెల్‌.

140 సార్లు కత్తితో పొడిచి!
1994లో లండన్​లోని అపార్ట్​మెంట్​లో మరీనాను 140 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు సందీప్ పటేల్. అప్పటికి మరీనా వయసు 39, పటేల్‌ వయసు 21 ఏళ్లు. తాజాగా లండన్ కోర్టు శుక్రవారం పటేల్​కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పటేల్​ను గతేడాది జనవరిలో మరీనా కోపెల్‌ చేతి ఉంగరానికి చిక్కుకుని ఉన్న వెంట్రుక ఆధారంగా అరెస్టు చేశారు. మరీనా మసాజ్‌ నిపుణురాలు. వివాహితైన ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త లండన్‌లోనే వేరే చోట ఉంటున్నారు. పిల్లలు మరీనా తల్లితో కలిసి కొలంబియాలో ఉంటున్నారు. మరీనా నెలనెలా వారికి డబ్బు పంపేది. అయితే మరీనాకు పటేల్‌తో ఉన్న సంబంధమేమిటో ఇంకా తెలియరాలేదు.

హత్య జరిగిన రోజు మరీనాకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవటం వల్ల ఆమె భర్త 1994 ఆగస్టు 8న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ మరీనా శవమై పడి ఉండడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరీనా చేతి ఉంగరాన్ని, అక్కడే ఉన్న ఒక ప్లాస్టిక్‌ సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్లాస్టిక్‌ సంచిపై సందీప్‌ పటేల్‌ వేలిముద్రలున్నాయి. అది అతడు పనిచేసే దుకాణం నుంచి కొన్నది కావడం వల్ల పోలీసులకు అనుమానం రాలేదు. ఉంగరంతోపాటు మరికొన్ని వస్తువులను కూడా హత్యా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఉంగరం మీద ఉన్న వెంట్రుకలు ఆధారంగా
2022నాటికి అధునాతన ఫోరెన్సిక్‌ పద్ధతులు అందుబాటులోకి రావడం వల్ల ఉంగరానికి అంటిన వెంట్రుక సందీప్‌ పటేల్‌దేనని గుర్తించగలిగారు. దీనితో పాటు ప్లాస్టిక్‌ సంచి మీదున్న వేలిముద్రలు తోడయ్యాయి. మరీనా ఏటీఎం కార్డును పటేల్ దొంగిలించాడు. హత్య చేసిన తర్వాత ఆమె ఇంటికి కొంత దూరంలో ఉన్న ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేశాడు. ఈ సాక్ష్యాధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పటేల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

క్రికెటర్ సందీప్​కు 8 ఏళ్ల జైలు శిక్ష- మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ కోర్టు తీర్పు

Man Sentenced To 240 Years In Prison: భార్య సహా ఇద్దరు హత్య.. 240 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details