World Liver Day 2024 : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా గుండె, కాలేయం, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలను భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే శరీర భాగాల్లో కాలేయం అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరంలోరి విషాన్ని ఫిల్టర్ చేస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు లివర్ నిరంతరం కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అలసిపోనివ్వకుండా, పాడవకుండా కాపాడుకోవాలంటే కాలేయానికి అవసరమైన పోషకాలను అందించాల్సి ఉంటుంది. కాలేయ శ్రేయస్సుకు అవసరమైన ఆహార పదార్థాలేంటో ఏప్రిల్ 19వ తేదీ వరల్డ్ లివర్ డే సందర్భంగా మనం తెలుసుకుందాం..
పసుపు
పసుపు కర్కుమిన్ అనే పదార్థంతో నిండి ఉంటుంది. శోధ నిరోధక లక్షణాలున్న ఇది కాలేయ నిర్విషీకరణకు సహాయం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డ్రై ఫ్రూట్స్
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే బాదం పప్పు, వాల్నట్ లాంటివి ఉత్తమ పదార్థాలుగా చెప్పవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లివర్ ను భద్రంగా ఉంచుతాయి.
క్వినోవా
ఫ్యాటీ లివర్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే క్వినోవా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే క్వినోవా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)ని నివారించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.