Why Do We get Bad Smell at Urination: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనే విషయం యూరిన్ ద్వారా అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. అందుకే.. యూరిన్ ద్వారా ఎన్నో రకాల పరీక్షలు చేసి వ్యాధులను తెలుసుకుంటారు. అయితే.. జనరల్‌గా మూత్రం అప్పుడప్పుడూ స్మెల్ వస్తుంది. మరికొన్ని సార్లు రంగు మారడం, మంట రావడం కూడా కామనే. అయితే.. వీటిపై పెద్దగా అవగాహన లేనివారు భయపడిపోతుంటారు. వెంటనే డాక్టర్‌ను కలుస్తుంటారు. మరి, మూత్రం దుర్వాసన ఎందుకు వస్తుంది? అది ప్రమాదకరమా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
కారణాలు ఏంటి : అప్పుడప్పుడు మూత్రం రంగు మారినా, మంట వచ్చినా, స్మెల్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రముఖ యూరో అంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ అడ్ల చెబుతున్నారు. పై లక్షణాలలో ఏది కనిపించినా అందుకు గల కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకోవాలని చెబుతున్నారు. అంటే మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మూత్రం దుర్వాసన (NIH - National Institutes of Health రిపోర్టు) వస్తుందంటే అంతకుముందు రోజు మనం తిన్న, తాగిన ఆహారం ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఉదాహరణకు రోజులో ఓ పదిసార్లు టీ, కాఫీ వంటి కెఫెన్ డ్రింక్స్ తాగడం, స్పైసీ వంటలు తినడం వంటి కారణాల వల్ల మరుసటి రోజు మూత్రం రంగు మారడం, వాసన రావడం వంటివి జరుగుతుంటాయని డాక్టర్ వివరిస్తున్నారు.
వెంటనే బాత్రూమ్కు పరిగెత్తాల్సివస్తోందా? - కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి!
రాత్రివేళ అతిగా మద్యం తాగినప్పుడు.. ఉదయం మూత్రం రంగు మారుతుంది. దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఏవైనా మందులు వాడుతున్నప్పుడు కూడా.. యూరిన్ కలర్ ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ముందు రోజు వరకు తిన్న, తాగిన వాటి ఆధారంగా రంగు మారినా, దుర్వాసన వచ్చినా పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదని అంటున్నారు.
నివారణ: మూత్రవిసర్జన సమయంలో వాసన, దురద, రంగు మారకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ 3 లీటర్ల మంచినీరు కచ్చితంగా తాగాలని డాక్టర్ సంజయ్ సూచిస్తున్నారు. అలాగే.. హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తినటం, రోజూ అరగంట సేపు వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల ఇలాంటి సమస్య తగ్గుతుందని అంటున్నారు. అలాగే పైన చెప్పిన లక్షణాలలో ఏమైనా కనిపించినా వెంటనే వర్రీ అవకుండా అంతకుముందు రోజు ఏం తిన్నాం? ఏం తాగినం? అని ఎనలైజ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాంటివేమి లేకుండా రోజూ యూరిన్‌లో సమస్యలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.