తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇండియన్స్ లో అధిక బరువుకు కారణాలు ఇవేనట - వెల్లడించిన రీసెర్చ్!

Why Are Indians Getting Fatter : ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు ఉన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఊబకాయులు మన దేశంలో కూడా భారీగా పెరిగిపోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటనే విషయం తెలుసుకునేందుకు 'ది లాన్సెట్‌ జర్నల్‌' ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించింది.

Why Are Indians Getting Fatter
Why Are Indians Getting Fatter

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 1:30 PM IST

Why Are Indians Getting Fatter :పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా మన దేశంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఈ సమస్య ఇప్పుడు మరీ తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారుల్లో కూడా చాలా మంది అధిక బరువుతో ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. దీనివల్ల చిన్నవయసులోనే షుగర్‌, బీపీ, లివర్‌, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మిరి దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.

'ది లాన్సెట్‌ జర్నల్‌' నివేదిక ప్రకారం.. 1990 నుంచి 2016 వరకు భారతీయులలో ఊబకాయం రేటు ఏకంగా 400 శాతం పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య 17.5 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

ఎందుకిలా?
ఒకప్పటితో పోల్చితే.. జనాలు సంప్రదాయ ఆహారమైన తృణధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు తినడం తగ్గించారు. వీటికి బదులుగా చక్కెర, కొవ్వులు, మాంసాహార పదార్థాలను అధికంగా తింటున్నారు. దీనివల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. మెజారిటీ ప్రజలు ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఇంకా పని ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల ఇండియన్స్‌ బరువు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో కూడా..
ప్రస్తుతం పిల్లల్లో కూడా అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి పలు కారణాలున్నాయి అవేంటంటే.. పిల్లలు స్కూల్‌, ట్యూషన్‌ల కారణంగా పెద్దగా ఆడుకోవట్లేదు. అంతేకాకుండా.. షుగర్‌, సాల్ట్‌ ఎక్కువగా ఉండే చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్స్, చాక్లెట్లు వంటి జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారు. ఫోన్‌లు, టీవీలకు అతుక్కుపోయి ఎంత తింటున్నారో తెలియకుండా లాగిస్తున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు.

మహిళలు ఇలా..
మహిళలు అధిక బరువు పెరగాడానికి ఫుడ్ హ్యాబిట్స్​తోపాటు వారి శరీరంలో వచ్చే హార్మోనల్ ఛేంజెస్, మెనోపాజ్‌ వంటివి కారణాలుగా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుందట. నగరాల్లో ఉండే మహిళల్లో మెజారిటీ జనం శారీరక శ్రమ కూడా తక్కువగా చేస్తుంటారు. ఈ కారణాల వల్ల మహిళలు అధిక బరువు పెరుగుతున్నారని పరిశోధకులు తేల్చారు.

అధిక బరువు ఎలా తగ్గించుకోవాలి ?

  • రోజూ శారీరక శ్రమను కలిగించే పరుగు, నడక, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి.
  • తాజా పండ్లు, కూరగాయలను తినాలి.
  • తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలి.

అమ్మాయిల్లో చిన్నతనంలోనే రజస్వల​ - అడ్డుకోకుంటే ప్రమాదమే!

రెడ్​ కలర్​ అరటి పండు - సంతానోత్పత్తి కెపాసిటీ నుంచి కంటి చూపుదాకా ఎన్నో బెనిఫిట్స్!

మీ కూరలో ఉప్పు ఎక్కువైందా? ఈ ఈజీ టిప్స్​తో అంతా సెట్!

ABOUT THE AUTHOR

...view details