Which Fruits Contains the Most Sugar? :భోజనం తక్కువగా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అనారోగ్యం పాలవుతారు. అలాగని ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ నుంచి గుండెజబ్బుల వరకు ఎన్నో చుట్టు ముడతాయి. అనారోగ్యం పాలవుతారు. హద్దు మీరితే ఏదైనా ఇబ్బందే! ఇది పండ్లకు సైతం వర్తిస్తుందని చెబుతున్నారు నిపుణులు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ తింటే.. ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఏ పండ్లలో ఎంత షుగర్ ఉంటుందో చూద్దాం.
అవకాడో : ఈ పండు 100 గ్రాములకు 0.7 గ్రాముల చక్కెరను కలిగి ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో చక్కెర కలిగిన పండు.
బ్లూ బెర్రీస్ : ఈ పండ్లలో కూడా షుగర్ పర్సంటేజ్ తక్కువ. 100 గ్రాముల బ్లూ బెర్రీస్లలో 4 గ్రాముల చక్కెర ఉంటుంది.
బెర్రీలు :వీటిని రెడ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. ఈ పండ్లలో స్ట్రాబెర్రీలు 100 గ్రాములకి 7 గ్రాముల చక్కెర, రాస్బెర్రీస్ 5 గ్రాములను కలిగి ఉంటాయి.
జామ : షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే మరో పండు జామ. ఈ పండ్లు 100 గ్రాముల బరువునకు 5 గ్రాముల చక్కెరను అందిస్తాయి.
నిమ్మకాయ : ఈ సిట్రస్ పండులో 100 గ్రాములకు 2.5 గ్రాముల చక్కెర ఉంటుంది.
మాండరిన్ : ఇది ఒక రకమైన నారింజ పండు. ఇవి 100 గ్రాములకి సుమారు 10 గ్రాముల చక్కెరను కలిగి ఉంటాయి.
పుచ్చకాయ : దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ పండును 100 గ్రాములు తీసుకుంటే 6 గ్రాముల చక్కెర లభిస్తుంది.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!
ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న పండ్లు :