Wash Your Hands After Touching These 10 Things:చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని మనందరికి తెలుసు. కరోనా వచ్చిన తర్వాత దీని ప్రాముఖ్యం మరింత అర్థమైంది. చేతులను క్లీన్ చేసుకోవడం వల్ల వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, క్రిములు సోకకుండా రోగాలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2017 Journal of Infectious Diseasesలో ప్రచురితమైన "Hand Hygiene and Diarrheal Disease" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. అయితే, రోజూవారీ జీవితంలో కొన్ని వస్తువులను తాకినా ఏం కాదులే అని చేతులు కడుక్కోకుండానే వదిలేస్తుంటాం. కానీ, ముఖ్యంగా ఈ 10 వస్తువులను ముట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా చేతులను క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (WHO రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కరెన్సీ నోట్లు: ప్రస్తుత డిజిటల్ యుగంలో కార్డులు, యూపీఐలు వచ్చినా.. కరెన్సీ నోట్లతో అవసరం ఉంటుంది. కానీ, నోట్లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే నోట్లపై అనేక క్రిములు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్ సిటీ బ్యాంక్‌లో చేసిన అధ్యయనంలో నోట్లపై బ్యాక్టీరియా, వైరస్, జంతువుల డీఎన్ఏ సహా వందలాది క్రిములు ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. నోట్లను లెక్కపెట్టిన తర్వాత చేతులు కడుక్కోవడం మంచిది.
రెస్టారెంట్ మెనూ: బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో రెస్టారెంట్లు తొలి వరుసలో ఉంటాయి. అందులో ముఖ్యంగా హోటళ్లలో ఉండే మెనూను తాకవద్దని సూచిస్తున్నారు. యూనివర్సిటీ అరిజోనా చేపట్టిన అధ్యయనంలో రెస్టారెంట్ మెనూలపై 1,85,000 బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మెనూను తాకినా.. ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.
మొబైల్స్, టచ్ స్కీన్లు: ఈ ఆధునిక యుగంలో పేపర్‌తో పనిలేకుండా అంతా ఫోన్లతోనే చేసేస్తున్నారు. అయితే, ఎక్కడెక్కడో చేతులు వేసి మన ఫోన్లు, టచ్ స్క్రీన్లను వాడుతుంటాం. కానీ, ఇలా చేయడం వల్ల స్క్రీన్లపై అనేక క్రిములు పేరుకుపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే ఫోన్లను వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు.
హాస్పిటల్‌లోని వస్తువులు: ప్రతి రోజు ఆస్పత్రులకు వివిధ వ్యాధులతో అనేక మంది రోగులు వచ్చిపోతుంటారు. ఫలితంగా హాస్పిటల్ ఆవరణలో చాలా బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయని నిపుణులు తెలిపారు. ఇంకా ఒక్క డాక్టర్ పెన్నుపైనే 46,000 క్రిములు ఉంటాయట. అందుకే ఆస్పత్రిలోని కుర్చీలు, వెయిటింగ్ రూమ్, హ్యాండిల్స్ తాకవద్దని సూచిస్తున్నారు.
జంతువులు: మనలో చాలా మంది పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోరు. అయితే, జంతువులపై అనేక క్రిములు, బ్యాక్టీరియా, వివిధ రకాల వైరస్లు ఉంటాయని.. కాబట్టి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
డోర్ హ్యాండిల్స్, సపోర్ట్ పోల్స్: చాలా మంది ఉపయోగించే తలుపుల హ్యాండిల్స్, గడియలు లాంటి వాటిని తరచూగా తాకవద్దని.. ఒకవేళ వాటిని పట్టుకున్నా చేతులను కడగాలని అంటున్నారు. ఇంకా లిఫ్ట్, ఎస్కలేటర్ల వద్ద ఉన్న పోల్స్, సపోర్ట్ హ్యాండిల్స్‌ను తాకవద్దని సూచిస్తున్నారు.