How to Prevent Osteoporosis:సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతుంటాయి. చిన్న తనంలో కూడా కొన్ని రకాల ఎముకల వ్యాధులు తలెత్తుతాయి. అందులో బోలు ఎముకల వ్యాధి ఒకటి. అసలు ఈ వ్యాధి అంటే ఏమిటి..? ఏ వయసు వారికి వస్తుంది..? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
బోలు ఎముకల వ్యాధి: ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకల కణజాలం దెబ్బతిని.. వాటి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎముకల్లో పగుళ్ల సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సైలెంట్ కిల్లర్. ఎముకలు విరిగేంత వరకూ ఎలాంటి లక్షణాలూ లేకుండా ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది.
మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?
ఎవరికొస్తుంది..:ఈ సమస్య వయసు పెరిగిన వారిలో, మెనోపాజ్‌లో ఉన్న మహిళలకి వచ్చే అవకాశం ఉంది. మగవారిలో వయసు పెరిగే కొద్దీ సమస్య ఉంటుంది. రెగ్యులర్‌గా పగుళ్లు, ముఖ్యంగా వెన్నెముక, మణికట్టు, తుంటి, ఇతర బరువు మోసే ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి.
వయసుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
బాల్యం :ఎముక ఆరోగ్యానికి బలమైన పునాది బాల్యం, కౌమారదశలో పడుతుంది. ఈ వయసులో పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, బలవర్ధకమైన ఆహారాలు, గింజలు వంటి కాల్షియం అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా.. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్ డి.. కాల్షియం చాలా ముఖ్యం. ఈ వయసులో రన్నింగ్, స్పోర్ట్స్ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ఎముకలు ధృడంగా అభివృద్ధి చెందుతాయి.