What Happens When You Stop Alcohol :సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడో ఒకసారి తాగడంతో మొదలయ్యే మద్యపానం.. క్రమంగా బానిసలుగా మార్చేస్తుంది. చాలా మంది ఈ ఊబిలో నుంచి బయట పడలేరు. కొందరు మాత్రం ఆల్కాహాల్ తాగడం వల్ల కలిగే నష్టాలనుతెలుసుకుని.. బంద్ చేయాలని డిసైడ్ అవుతారు. అయితే.. చాలా కాలంపాటు తాగి, ఒక్కసారిగా మందు తాగడం మానేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొద్దిగా తాగినా ప్రమాదమే!
మందు కొద్దిగా తాగినా లేదా ఎక్కువగా తీసుకున్నా కూడా మన ఆరోగ్యం పాడవుతుంది. దీర్ఘకాలింగా మద్యం ఎక్కువగా తాగడం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి వివిధఅవయవాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. మందు తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అల్డిహైడ్స్ అనే కెమికల్‌గా విడిపోతుంది. అక్కడ నుంచి పేగుల్లోని రక్తం ద్వారా కాలేయం వంటి ఇతర శరీర భాగాలకు చేరుతుంది. లివర్ మనం తిన్న ఫుడ్‌లో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి, ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే అల్డిహైడ్ అనే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
ఒక్కసారిగా మానేస్తే 'తలనొప్పి' తప్పదు!
మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, ఒక్కసారిగా మందు మానేయడం వల్ల కొందరిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిని 'విత్‌డ్రాయల్ సిండ్రోమ్' అని అంటారు. ఒక్కసారిగా మందు తాగడం మానేయడం వల్ల కొంతమందిలో టెన్షన్, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2018లో "అడిక్షన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మద్యం తాగడం మానేసిన చాలామందిలో తలనొప్పి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. ఒక్కసారిగా మందు తాగడం మానేస్తే తలనొప్పి వస్తుందని ఆయన పేర్కొన్నారు.