What Causes Bad Body Smell :శరీరం నుంచి చెమట దుర్వాసన రావడానికి.. మనం తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఆ ఫుడ్ ఐటమ్స్ తక్కువగా తీసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. మరి.. అవేంటి? అన్నది ఈస్టోరీలో చూద్దాం.
క్యాబేజీ, గోబీ :
క్యాబేజీ, గోబీలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును విడుదల చేస్తాయట. ఈ వాయువు దుర్వాసన వస్తుంది. ఇది శ్వాస ద్వారా బయటకు వచ్చినప్పుడు నోటి దుర్వాసనకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరం నుంచి కూడా బ్యాడ్‌స్మెల్ వస్తుంది.
మీ శరీరం నుంచి ఈ రకమైన దుర్వాసన వస్తోందా? - అయితే, మీకు డయాబెటిస్ ఖాయం!
వెల్లుల్లి :
వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే వెల్లుల్లి నోటి దుర్వాసకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో "Journal of Breath Research" అనే జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి తినడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో నెదర్లాండ్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ & రీసెర్చ్‌కు చెందిన 'డాక్టర్ జోహన్ పీటర్ వాన్ ట్రిజ్ప్' పాల్గొన్నారు.
మసాలాలు :
కొంతమందికి స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం! ఇలా తినే వారు ఆహార పదార్థాలలో ఎక్కువగా మసాలాలను యాడ్ చేసుకుంటారు. అయితే, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల శరీరం నుంచి దుర్వాసన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మసాలా దినుసులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టి బ్యాడ్ స్మెల్‌వస్తుందట. ఇది నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది. కాబట్టి, శరీర దుర్వాసనతో బాధపడేవారు మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.