Pink Salt Benefits for Health:ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత ఉప్పు తినాలంటేనే చాలా మంది ఆలోచిస్తారు. కానీ, దానికి బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే పింక్ సాల్ట్‌ను ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు. ఈ ఉప్పును వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పింక్ సాల్ట్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్‌లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి 80 రకాల మినరల్స్ ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
- తెల్ల ఉప్పులో కంటే పింక్ సాల్ట్‌లో సోడియం స్థాయులు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుతో ఇబ్బంది పడుతూ తక్కువ సోడియం తీసుకోవాలనుకునే వారికి ఇది మంచిదని అంటున్నారు.
- సాధారణంగా ఉప్పు శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే పింక్ సాల్ట్ అయితే బాడీని తేమగా ఉంచుతూ.. ఎలక్ట్రోలైట్ల స్థాయులను బ్యాలెన్స్ చేస్తుందని వివరిస్తున్నారు.
- శరీరంలోని మలినాలను తొలగించి డిటాక్సిఫయింగ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా శరీరం కొత్త ఉత్తేజాన్ని పొందుతుంని వివరిస్తున్నారు.
- ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు పింక్ సాల్ట్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆహారం తేలికగా జీర్ణం అవ్వడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. 2020లో Journal of Food Scienceలో ప్రచురితమైన "The effects of Himalayan pink salt on gut health" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- పింక్ సాల్ట్‌లో అధిక సంఖ్యలో ఎలక్ట్రోలైట్లు ఉండడంతో శరీరంలోని పీహెచ్ స్థాయులు బ్యాలెన్స్ అవుతాయని అంటున్నారు. దీంతో శరీరం పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
- చర్మంపై మృత కణాలను తొలగించడంతో పాటు యాంటీ ఏజింగ్‌గానూ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరం నుంచి వచ్చే చెడు వాసననూ దూరం చేస్తుందని తెలిపారు.
- ఇంకా పింక్ సాల్ట్‌ను సహజ పద్ధతుల్లోనే ప్రాసెస్ చేస్తుంటారు. సాధారణ ఉప్పను పూర్తిగా రిఫైండ్ చేసి తెల్లగా కనిపించేందుకు రసాయనాలు కలుపుతారని చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.