Weight Loss Tips In Telugu :అధిక బరువు ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య, అందుకే 'ఫోర్బ్స్' నిర్వహించిన సర్వేలో సైతం బరువు తగ్గటం అనేది న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో 4వ ప్రాధాన్యం గల అంశంగా గుర్తించారు. అయితే మనం బరువు తగ్గటానికి మెట్టమొదటగా చేయాల్సిన పని మన ప్రస్తుత బరువును కచ్చితంగా అంచనా వేయటం. అలా చేయటం వల్ల మీరు ఎంత బరువు తగ్గారో స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. అంతే కాకుండా వారం వారం ప్రత్యేకమైన లక్ష్యాలను పెట్టుకొని ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
బరువు చూసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- నిపుణుల సూచనలు
1. ప్రతి వారం శరీర బరువు చెక్ చేసుకోండి
మనం వెయిట్ లాస్ అయ్యే క్రమంలో కచ్చితంగా ప్రతీ వారం బరువును చెక్ చేసుకోవాలి. దాని ద్వారా మన సాధన సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని అంచనా వేయవచ్చు.
2. పాదరక్షలు ధరించి బరువు చెక్ చేయవద్దు
మెదటగా వెయిట్ చూసుకునేటప్పుడు శరీరంపై ఇతర వస్తువులు లేకుండా చూసుకోవాలి. ప్రతి వారం ఈ విధంగానే బరువును చూడాలి. ఒకవేళ మీరు పాదరక్షలు ధరించి లేదా ఏ ఇతరత్రా ఏమైనా అలంకరించుకుని ఉంటే బరువు చూసుకుంటే కచ్చితత్వం దెబ్బతింటుంది. అంతే కాకుండా ప్రతివారం ఒకే సమయంలో వెయిట్ చెక్ చేయటం మంచిది.
3.వెయిట్ మిషన్ సరిగ్గా ఉంచండి.
మనం బరువును చూసేటప్పుడు వెయిట్ మిషన్ను సరైన ప్రదేశంలో ఉంచండి. దానితో పాటు మీ రెండు కాళ్లను వెయిట్ మిషన్పై సరిగ్గా ఉంచండి.