తెలంగాణ

telangana

ETV Bharat / health

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ! - Weight Loss Tips - WEIGHT LOSS TIPS

Weight Loss Tips : నేటి రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. అధిక బరువు. దీంతో చాలా మంది ఎలాగైనా బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్​కి వెళ్లి తీవ్ర కసరత్తులు చేయడం, తినే ఆహారాన్ని తగ్గించడం, ఏవేవో చిట్కాలు పాటించడం చేస్తుంటారు. అలాకాకుండా నిపుణులు సూచిస్తున్న ఈ ప్రణాళికను పాటించి చూడండి. వారంలో అరకిలో తగ్గడం పక్కా! అదేంటో ఇప్పుడు చూద్దాం.

Best Weight Loss Plan
Weight Loss Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 11:02 AM IST

Best Weight Loss Plan : వివిధ ఆరోగ్య సమస్యలకు అధిక బరువూ ఓ కారణం. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం అంతంతమాత్రమే! అయితే, అందుకు కారణం.. ఎంత బరువు ఎంత సమయంలో తగ్గాలి? ఎలా తగ్గాలి? అనే దానిపై అవగాహన లేకపోవడమే అంటున్నారు నిపుణులు. అలాంటి వారికోసం బరువు(Weight) తగ్గడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రణాళికను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఇది ఫాలో అవ్వడం ద్వారా వారానికి అరకిలో బరువు తగ్గొచ్చని ఛాలెంజ్ విసురుతున్నారు! ఇంతకీ, ఆ ప్రణాళిక ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • బరువు తగ్గాలనుకునేవారు కేవలం వ్యాయామంతోనే వెయిట్​ లాస్​ అవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. వ్యాయామంతో పాటు దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలని.. అప్పుడే అనుకున్న ఫలితం దక్కుతుందని సూచిస్తున్నారు.
  • అలా అని ఒకేసారి ఆహారంలో పూర్తిగా మార్పులు, పరిమాణం తగ్గించడం చేస్తే అస్వస్థతకు గురవుతారంటున్నారు. ఎందుకంటే.. ఏ మార్పునైనా తీసుకోవడానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి, నిదానంగా బరువు తగ్గడానికి పాటించాల్సిన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలంటున్నారు.
  • ముఖ్యంగా వెయిట్ లాస్​కి అనుగుణంగా ఉండేలా కేలోరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడానికి ఓ ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా ఆ డైట్ ప్లాన్​లో తగినంత పోషకాహారం అందేలా చూసుకోవాలి. అదే.. సరైన పోషకాహారం లేకపోతే శరీరానికి సరిపడా శక్తి లభించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
  • అదేవిధంగా, వేపుళ్లు, పచ్చళ్లు, ప్రాసెస్డ్​, జంక్ ఫుడ్​ వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు వీటిని అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు.
  • 2019లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులు బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ డాన్ లూడ్స్ పాల్గొన్నారు. జంక్​ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తినే వారు ఊబకాయం బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

హెచ్చరిక : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? - ఆరోగ్యానికి తీవ్ర ముప్పు - వారానికి ఇంతే తగ్గాలి!

  • ఆహార పదార్థాలను ఎంచుకోవడం మాత్రమే కాదు అవి తినే ముందు ఎలా వండుతున్నారో కూడా గమనించుకోవాలి. వీలైనంత వరకు గ్రిల్లింగ్, స్టీమింగ్, బేకింగ్ చేసినవే తినడానికి ప్రయత్నించాలి. అలాగే.. కూరలను వండే క్రమంలో ఎక్కువ నూనె వాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. ఎక్కువ ఆయిల్ వాడి కూరలను వేయించడం వల్ల శరీరంలో అదనపు కొవ్వులు చేరుకుంటాయి.
  • అలాగే రోజువారి డైట్​లో తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువ మొత్తంలో చేర్చుకునేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. అంటే.. ఒక కప్పు అన్నంతో పాటు రెండు కప్పుల కూర ఉండేలా చూసుకోవాలి. సలాడ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
  • రాగులు, కొర్రలు, జొన్నలు వంటి తృణధాన్యాలను ఉపయోగించి రొట్టెలు, దోశలు చేసుకొని తీసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇక వ్యాయామం విషయానికొస్తే.. జాయిన్ అయిన మొదటి రోజే జిమ్​లో గంటల కొద్దీ శ్రమించకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొదటి రోజే ఎక్కువగా శ్రమిస్తే.. రెండో రోజు లేచి నిలబడేందుకు కూడా ఓపిక ఉండదు. కాబట్టి, నిదానంగా చిన్న చిన్న స్ట్రెచ్​లతో మొదలుపెట్టి వర్కౌట్​లను పెంచుకోవాలని సూచిస్తున్నారు.
  • అదేవిధంగా వాకింగ్ చేసినా బరువు తగ్గుతారు. రోజూ క్రమంగా కొంత సమయాన్ని కేటాయించుకొని నడవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. పైన చెప్పిన అంశాలన్నింటితో కూడిన ఈ ప్రణాళికను పాటిస్తే వారానికి కనీసం అరకిలో అయినా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బరువు తగ్గాలని డిన్నర్​ స్కిప్​ చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details