Pale Nails High Cholesterol :ప్రతీ ఒక్కరి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను (లో డెన్సిటీ లైపోప్రొటిన్) LDL అని, మంచి కొలెస్ట్రాల్‌ను (హై డెన్సిటీ లైపోప్రొటిన్) HDL అని అంటారు. ఇందులో LDL తక్కువగా ఉండాలి. కానీ.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాల వల్ల చాలా మంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు పెరిగినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!
- మన బాడీలో ఎల్‌డీఎల్ స్థాయులు ఎక్కువగా ఉంటే కాలి గోర్లు పెళుసుగా మారతాయి. అలాగే గోర్లు నెమ్మదిగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
- ఇంకా కాలి గోర్లు లేత పసుపు రంగులోకి మారతాయి. ఇలా గోర్లు రంగు మారడానికి కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం ఒక కారణమని చెబుతున్నారు.
- అధిక కొలెస్ట్రాల్ వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి, అవి రంగు మారతాయని అంటున్నారు.
- 2014లో 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. శరీరంలో LDL స్థాయిలు అధికంగా ఉన్నవారి గోర్లు పసుపు రంగులో ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ ప్రొఫెసర్ 'డాక్టర్ మార్క్ ఎస్. లియోని' పాల్గొన్నారు.
- అలాగే గోర్లపై నీలి రంగు లేదా ముదురు మచ్చలు కనిపించినా కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినట్లు అర్థం చేసుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గించుకోవాలి ?
- శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్‌లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి.
- అలాగే కొలెస్ట్రాల్ స్థాయులను పెంచే కొవ్వు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- శరీరానికి చెమట పట్టేలా రోజూ పరుగు, నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలను చేయండి.
- ఇలా చేస్తే ఈజీగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
- స్మోకింగ్ చేయడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి, ఈ అలవాటు పూర్తిగా మానేయాలి.
- అధిక బరువున్న వారు.. వెయిట్ లాస్ అవ్వడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చు.
- తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడానికి ఒక కారణమవుతాయి.
- కాబట్టి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి రోజూ యోగా, ధ్యానం వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.