Signs Of Sugar In Morning :రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ వచ్చే హెచ్చుతగ్గులతో పాటు దైనందిక జీవితంలో కనిపించే లక్షణాలను బట్టి మనకు డయాబెటిస్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఉదయం సమయంలోనే మనం ఎక్కువగా ఈ లక్షణాలను గమనించగలం. వీటిని శరీరం మనకు ఇస్తున్న హెచ్చరికలుగా భావించి పరీక్ష చేయించుకుంటే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏవంటే?
హైపర్‌గ్లేకేమియా (ఎక్కువగా దాహం):
ఇది ఉదయం వేళల్లో రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే కనిపిస్తుంది. ఉదయం 4 నుంచి 8గంటల సమయం మధ్యలో ఈ మార్పులు కనిపిస్తాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు దాహంగా అనిపిస్తుంది. హై బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ పెరిగి శరీరంలో ద్రావణాలు ఎక్కువగా అవసరమై డీహైడ్రేట్ అయి దాహం ఎక్కువగా అనిపిస్తుంది.
మూత్రం ఎక్కువగా అవుతుండటం:
ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం షుగర్ లెవల్ పెరిగిందనడానికి ఒక సూచన. సాధారణంగా ఇది రాత్రి లేదా ఉదయం వేళల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలు మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.
ఉదయం నీరసంగా:
నిద్ర లేవగానే నీరసంగా, మత్తుగా ఉండటం కూడా షుగర్ ఎక్కువగా ఉందనడానికి ఒక ఉదాహరణ. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి శరీరానికి సరిపడ శక్తి ఇవ్వలేకపోవడం వల్ల ఉదయాన్నే నీరసించిపోతాం. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లి నిద్ర సరిగా లేకపోవడం కూడా ఉదయం సమయంలో నీరసానికి కారణంగా భావించవచ్చు.
తలనొప్పి:
డయాబెటిస్ ఉన్నవాళ్లలో తరచుగా కనిపించే లక్షణం తలనొప్పి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసేమియా, తక్కువగా ఉంటే హైపోగ్లైసేమియా అంటుంటారు. ఇలా ఉన్నప్పుడు తరచూ తలనొప్పి వస్తుంటుంది.