Best Foods For Vitamin D : నేటి రోజుల్లో ఎండ పొడ తగలకుండా రోజంతా ఏసీ గదుల్లో ఉండటం వంటి కారణాలతో చాలా మంది "విటమిన్ డి" లోపంతో బాధపడుతున్నారు. ఇక వర్షాకాలం అయితే సూర్యరశ్మి సరిగా ఉండదు. దీంతో.. ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మీరు "విటమిన్ డి"(Vitamin D)లోపం బారినపడకుండా ఉండాలంటే.. మీ డైట్లో ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కమలా పండ్లు :వీటిలో విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి, మీరు డైలీ ఒక కమలా పండు తిన్నా లేదంటే దాన్ని జ్యూస్ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
పాలు, పెరుగు :శరీరానికి కావాల్సిన విటమిన్ Dని అందించడంలో పాలు, పెరుగు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అలాగే వీటిలో ప్రొటీన్స్, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ. అయితే, బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్స్ కలుపుతుంటారు. కాబట్టి దానిలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేసుకొని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
సన్ స్క్రీన్ లోషన్ వాడితే విటమిన్-D అందదా? నిజమెంత?
చేపలు : విటమిన్ D సమృద్ధిగా లభించే మరో పోషకాహారం.. చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో D విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే కాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్.. వంటి ఇతర పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి. కాబట్టి, చేపలు మీ డైట్లో తరచుగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
2015లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. సాల్మన్, మాకేరెల్, ఇతర చేపలలో విటమిన్ D పుష్కలంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జర్మనీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు డాక్టర్ Hirche Frank పాల్గొన్నారు. తరచుగా చేపలు తినడం ద్వారా విటమిన్ లోపం బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.