Vitamin B12 Deficiency Symptoms : కొంత మంది చూడ్డానికి సాఫ్ట్‌గానే ఉంటారు. కానీ.. ఏదైనా చిన్న తప్పు జరిగినా, లేదా తాను చెప్పిన మాట వినలేదు అనిపించినా.. వెంటనే ఊహించని స్థాయిలో అవతలి వ్యక్తిపై విరుచుకుపడతారు. అలిగి మౌనంగా ఉండిపోతారు. తర్వాత "నేను అలా చేయాల్సింది కాదు.. సారీ" అని కూడా చెప్తారు. వెంట వెంటనే మూడ్ స్వింగ్స్ తో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారో.. వారికి కూడా తెలియదు! మరి.. ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా? ఒక విటమిన్ లోపించడమే అంటున్నారు నిపుణులు! ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొద్ది సమయంలోనే కోపం, ప్రేమ వంటి రకరకాల హావ భావాలను వ్యక్త పరచడం ఒక రకమైన మానసిక వ్యాధేనట! పోషకాహారం లోపం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మన బాడీలో ఇలా మూడ్ స్వింగ్స్ సమస్యలు కనిపించడానికి ఎక్కువ కారణం విటమిన్ బి12లోపమే అంటున్నారు! ఎర్ర రక్త కణాల నిర్మాణానికి, నరాల పనితీరుకు సరిగ్గా ఉండడానికి విటమిన్ బి12 ఎంతో సహాయం చేస్తుంది. మరి.. ఈ విటమిన్ లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
- కాళ్లు తిమ్మర్లు రావడం
- నడవడానికి ఇబ్బంది ఉండటం
- రక్తహీనత
- ఆలోచన సరిగా లేకపోవడం
- ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం
- అలసటగా, బలహీనంగా అనిపించడం
- డిప్రెషన్
- 2018లో 'మయో క్లినిక్ రీసర్చ్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. విటమిన్ బి 12, బి6, ఫోలేట్, వంటి విటమిన్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సెయింట్ లూయిస్ కు చెందిన 'డాక్టర్ డేనియల్ హాల్-ఫ్లావిన్' పాల్గొన్నారు.
- ఇంకా మైకం కమ్మినట్లు అనిపిస్తుంది
- రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది
- మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి
- రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి గుండె వేగంగా కొట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
శాకాహారుల్లోనే ఎక్కువగా!
విటమిన్ బి12 లోపం సాధారణంగా శాకాహారుల్లో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు పైబడిన వారిలో కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. విటమిన్ బి12 లోపంతో బాధపడేవారు చికెన్, పాలు, చేపలు తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పాలకూర, బీట్రూట్, చీజ్ వంటి ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.