Vegetable Peel Benefits For Skin : వంట చేసేందుకు మనం చాలా రకాల కూరగాయలను ఉపయోగిస్తుంటాం. అందులో భాగంగా బంగాళాదుంప, క్యారెట్ వంటి కూరగాయల తొక్కలను తీసేస్తుంటాం. లోపలి కండ భాగాన్ని వంటల్లో, తీసేసిన తొక్కల్పి చెత్త డబ్బాలో వేస్తుంటాం. కానీ కూరగాయల తొక్కలను కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? వాటిలో కూడా చాలా రకాల పోషకాలుంటాయంటే మీరు కాదని అనగలరా. కూరగాయల తొక్కలతో బెనిఫిట్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మనం నేరుగా తినేముందు గానీ, వంటం వండే ముందు గానీ కూరగాయల తొక్కలు తీసి పడేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, లేక పండించే సమయంలో వాడే పురుగుల మందులు లాంటివి ఒక కారణమైతే. తొక్కలు చేదుగా, మచ్చలుగా ఉండటం వలన కూరగాయ రుచి కోల్పోవడం మరో కారణం. అయితే చాలా రకాల కూరగాయల లాగానే వాటి తొక్కల్లో కూడా ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, అవి చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడతాయని కాస్మోటాలజిస్ట్లు, చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏయే కూరగాయల తొక్కలను ఉపయోగించుకోవచ్చు?
బంగాళదుంప
బంగాళదుంప తొక్కల్లో విటమిన్-సీ, విటమిన్-బీ6, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తొలగించడానికి, కంటి కింద నల్లటి వలయాలు పొగెట్టేందుకు, చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.
దోసకాయ తొక్కలు
వీటిలో సిలికా, విటమిన్-కేతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి చల్లదనాన్ని, హైడ్రేటింగ్ లక్షణాలను అందిస్తాయి. చర్మం రంగు, స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో దోసకాయ తొక్కలు బాగా ఉపయోగపడతాయి.
క్యారెట్
క్యారెట్ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్-ఏ , విటమిన్-సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ, గీతలు, ముడతలు తగ్గించడంలోనూ సహాయపడతయి.
బీట్ రూట్ పీల్స్
వీటిలోని బీటాలైన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- ఎ, విటమిన్-సీ రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలాగే ముఖానికి సహజమైన కాంతిని అందిస్తాయి. బీట్ రూట్ లొక్కల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, చికాకు మంట లాంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.