Unhealthy Part Of Chicken :టేస్టీగా, యమ్మీగా ఉండి హెల్తీ ఫుడ్ అని చాలా మంది భావించే ఆహార పదార్థాల్లో చికెన్ టాప్‌లో ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ చికెన్‌ను చాలా చాలా ఇష్టపడుతుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన మాంసమే అయినప్పటికీ దీంట్లోని ఓ భాగం శరీరానికి హాని కలిగిస్తుందట. అది కూరకు రుచిని అందించినప్పటికీ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను అందిస్తుందట. అవును మీరు అనుకుంటుంది నిజమే మేం చెబుతున్నది చికెస్ స్కిన్ గురించే.
ఇంతకీ చికెన్ స్కిన్‌లో ఏముంటుంది?
కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే దీంట్లో పోషక విలువలేమీ ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే కోడి శరీరంలో అస్సలు ఉపయెగం లేని భాగం ఏదైనా ఉందా అంటే అది దాని చర్మం. ఇంకో విషయం ఏంటంటే కోడి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫాం వాళ్లు లేదా దుకాణాదారులు కోడి తోలుపై కెమికల్స్ చల్లుతారు.
చికెన్ స్కిన్ తింటే ఏమవుతుంది?
చికెన్ స్కిన్ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని చికెన్ స్కిన్ వినియోగం పెంచుతుంది. USDA చేసిన అధ్యయనం ప్రకారం, చర్మం తీసివేసి వండిన ఒక కప్పు చికెన్‌లో 231 కేలరీలు ఉంటాయి, అదే కప్పులో చర్మంతో కలిపి వండిన చికెన్‌లో 276 కేలరీలు ఉంటాయి. అంటే చర్మం ప్రతి ఔన్స్‌లో, ప్రతి కప్పులో 3 గ్రాముల సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది.