Best Tip To Removing Toilets Limescale :ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో టాయిలెట్స్‌ను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. రకరకాల క్రిములు, బ్యాక్టీరియా చేరి మురికి కూపంగా మారుతాయి. దీంతో కమోడ్ చూడడానికే ఇబ్బందిగా ఉంటుంది. ఇక, టాయిలెట్ పాట్లో ఏర్పడిన పసుపు మరకలు అస్సలే వదిలిపోవు. దీంతో.. క్లీన్ చేయడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టాయిలెట్ పాట్లో ఏర్పడే పసుపు రంగు మరకలను 'లైమ్‌స్కేల్' అని అంటుంటారు. అయితే, ఈ మరకలు చూడడానికి అసహ్యకరంగా కనిపించడమే కాదు.. దీర్ఘకాలిక ప్లంబింగ్ సమస్యలకూ దారి తీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, వీటిని వెంటనే తొలగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకోసం సరైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే.. రెగ్యులర్ క్లీనింగ్ చేసినప్పటికీ ఈ మరకలు ఏర్పడటానికి కారణమేమిటంటే.. మనం వాడే వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడమేనట. అవి ఉండే హార్డ్ వాటర్ వాడడం వల్ల ఆ ఖనిజాలు పేరుకుపోయి పసుపు, ఎరుపు, గోధుమ, లేదా ఆకుపచ్చ మరకలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. ఈ మరకలను నేచురల్‌గా సులభంగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు.
వెస్ట్రన్ టాయిలెట్‌తో ఇన్ఫెక్షన్స్ వస్తాయా? - ఏం చేయాలి?
- అందుకోసం.. మీరు ముందుగా ఒక అరలీటర్ వైట్ వెనిగర్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయను కట్ చేసుకొని పిండుకోవాలి. అనంతరం కొన్ని వేడినీళ్లు తీసుకొని దానిలో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఆపై దాన్ని టాయిలెట్ బౌల్లో పోసి కనీసం ఒక గంటపాటు వేచి ఉండాలి.
- ఆ తర్వాత.. టాయిలెట్ బ్రష్‌తో మరకలు ఉన్న చోట స్క్రబ్ చేయాలి. అనంతరం మీది వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఫ్లష్ చేయాలి. అదే.. నార్మల్ టాయిలెట్ అయితే వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి.
- అంతే.. మీ టాయిలెట్ పాట్లో ఉన్న పసుపు మరకలు తొలగిపోయి తెల్లగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
- పసుపు మరకలు నిరోధించడానికి ప్రతి 2 నుంచి 4 వారాలకోసారి ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఆ మరకలు ఏర్పడకుండా ఉంటాయని చెబుతున్నారు.