తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ పెదాల చుట్టూ ఇలా నల్లగా మారిందా? - ఇలా చేస్తే పాలరాతి అందం మీ సొంతం! - Remove Darkness Around Mouth - REMOVE DARKNESS AROUND MOUTH

How To Remove Black Marks Around Mouth : ముఖం ఎల్లప్పుడూ చంద్రబింబంలా మెరుస్తుండాలని అమ్మాయిలందరూ కోరుకుంటారు. కానీ.. కొంత మంది అమ్మాయిల పెదాల చుట్టూ నల్లటి వలయం తయారవుతుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అయితే.. కొన్ని సింపుల్‌ టిప్స్ ద్వారా పాలరాతి లాంటి అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Black Marks Around Mouth
How To Remove Black Marks Around Mouth (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 1:52 PM IST

Tips To Remove Black Marks Around Mouth :నలుగురిలో అందంగా కనిపించాలని అమ్మాయిలు తెగ ఆరాటపడుతుంటారు. అందుకోసం డైలీ వివిధ రకాల కాస్మెటిక్‌ ఉత్పత్తులు, మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లను వాడుతుంటారు. అయినప్పటికీ.. కొంత మంది అమ్మాయిలముఖం నల్లగా ఉంటుంది. ముఖ్యంగా పెదాల చుట్టూ నల్లగా తయారవుతుంది. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెదవుల చుట్టూ నలుపు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి :

కీరాదోస:

  • కీరాదోస గుజ్జు (తొక్క తీసి, మిక్సీ వేసుకోవాలి)- 2 టేబుల్‌ స్పూన్లు
  • శనగపిండి- చెంచా

ముందుగా ఈ రెండు పదర్థాలను బాగా మిక్స్ చేసి పెదవుల చుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులంటున్నారు. ఒకవేళ కీరాదోస అందుబాటులో లేకపోతే ఈ ప్యాక్‌లో యాపిల్ లేదా పచ్చిబంగాళాదుంప గుజ్జుని కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

పాల మీగడ :
పాలల్లోని మీగడను తీసి.. అందులో చిటికెడు పసుపు వేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూతి చుట్టూ రాయండి. అలాగే ఇందులో కొద్దిగా శనగ పిండి కలుపుకుని.. అప్లై చేసుకున్నా కూడా నలుపును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డైలీ పసుపుతో ఇలా చేశారంటే - మెరిసే అందం మీ సొంతం!

అలోవెరా జెల్‌ :
మొటిమలను తగ్గించడానికి అలోవెరా జెల్‌బాగా పనిచేస్తుందని చాలా మందికి తెలుసు! కానీ, దీనిని రోజూ మూతి చుట్టూ రాసుకోవడం వల్ల నలుపును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి, మూతి చుట్టూ నల్లగా ఉండే వారు అలోవెరా జెల్‌ను డైలీ ఉపయోగించండి.

రోజ్‌ వాటర్‌ :
డైలీ ముఖానికి రోజ్‌ వాటర్‌తో మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే.. ప్రకాశవంతంగా మెరుస్తుంది. కొద్దిగా కాటన్‌ తీసుకుని అందులో కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ను వేసుకుని.. మూతి చుట్టూ రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులంటున్నారు.

బంగాళాదుంప :
పెదాల చుట్టూ నల్లగా ఉండే వారు రోజూ బంగాళాదుంప రసంతో మర్దనా చేసుకోవడం వల్ల.. కొన్ని రోజుల్లోనే అక్కడ స్కిన్‌ తెల్లగా మారుతుంది. 2018లో "ఫిటోథెరపీ రీసెర్చ్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బంగాళదుంప రసంలో బ్లీచింగ్ లక్షణాలన్నాయని, ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చర్మవ్యాధి నిపుణుడు 'డాక్టర్‌ హ్యూన్-కిమ్ కిమ్' పాల్గొన్నారు. రోజూ బంగాళాదుంప రసం అప్లై చేసుకోవడం వల్ల కొంత మేరకు ముఖంపై ఉన్న మచ్చలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్​ గ్యారెంటీ!

ఈ ఫేస్​ ప్యాక్​ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!

ABOUT THE AUTHOR

...view details