Tips To Remove Bitterness Of Bitter Gourd :ఎక్కువ మంది ఇష్టపడని కూరల్లో కాకరకాయ ఒకటి. ఈ కాకరకాయను ఫ్రై చేసినా.. లేదా పులుసు లాగా వండినా కూడా చేదుగానే ఉంటుంది. ఈ కారణంగానే దీన్ని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు! నిజానికి చేదుగా ఉండే కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలుసు. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెప్తారు. వారానికి ఒకసారైనా కాకరకాయను తినడం వల్ల.. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చని సూచిస్తారు. అయినప్పటికీ.. కాకరకాయ పేరు చెప్పగానే "నో" అంటారు! అయితే.. సరిగ్గా వండాలే గానీ కాకరకాయలోని చేదు మొత్తం తగ్గించవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి.. కాకరకాయను ఎలా వండితే చేదు తగ్గుతుందో మీకు తెలుసా? ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టిప్స్ పాటించండి :
- కాకరకాయలో చేదు మొత్తం పైన ఉండే గరుకు భాగంలోనే ఉంటుంది. అయితే, మీరు ఈ సారి కాకరకాయలను కట్ చేసేటప్పుడు గరుకు భాగాన్ని మొత్తం బీరకాయ పొట్టు తీసేసినట్లు తొలగించండి.
- తర్వాత మీకు నచ్చినట్లుగా కాకరకాయలను కట్ చేసుకుని కర్రీ చేయండి. ఇలా చేస్తే చేదు చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులంటున్నారు.
- అలాగే కాకరకాయలను కట్ చేసినప్పుడు అందులోని గింజలను తొలగించండి. ఇలా చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందట.
- కాకరకాయలను కట్ చేసిన తర్వాత వాటిపైన కొద్దిగా ఉప్పు చల్లి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా నీళ్లలో కడిగి వండితే కూడా చేదు తగ్గుతుంది.
- అలాగే మరుగుతున్న నీళ్లలో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను.. ఉప్పు వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.