Tips To Control Dry Skin And Dandruff :కొంతమంది నిత్యం చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. తల స్నానం చేస్తున్నా కూడా ఇబ్బంది తొలగిపోదు. దీనివల్ల తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టు గడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మరి.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో..? నిపుణులు ఏం చెబుతున్నారో..? ఇప్పుడు చూద్దాం.
జుట్టు గడ్డిలా తయారవడానికి మాడు మీద ఎక్కువగా నూనెలు విడుదల కాకపోవడం ఒక కారణమని.. ఇది పొడి చర్మం లాంటి ఒక రకమైన సమస్యని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాస్మటాలజిస్ట్ 'డాక్టర్ శైలజ సూరపనేని' చెబుతున్నారు. సాధారణంగా ఈ సమస్య వయసు పెరిగేకొద్దీ కనిపిస్తుందని అంటున్నారు. నలభై ఏళ్ల పైబడిన వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
కారణాలు ఇవే!
అతిగా తలస్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలు, ఆల్కహాల్ ఉన్న స్టైలింగ్ ఉత్పత్తులు, హీట్ స్టైలింగ్ పరికరాలను వాడటం, డ్రైయ్యర్‌తో జుట్టును ఆరబెట్టడం, ఎండలో బాగా తిరగడం వంటి కారణాలతో తలపైన నూనెలు సరిగా విడుదల కావని చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ సమస్య వంశ పారంపర్యంగా కూడా జుట్టు సమస్యలు వస్తాయని అంటున్నారు.
జుట్టు ఎక్కువగా రాలుతోందా ? - రోజూ ఈ జ్యూస్‌లు తాగారంటే ప్రాబ్లమ్ సాల్వ్!
జుట్టు ఆరోగ్యం కోసం ఇలా చేయండి!
జుట్టు గడ్డిలా మారుతున్నవారు.. కురులు ఆరోగ్యంగా ఉండటానికి వారానికి రెండు సార్లకు మించి తలస్నానం చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే తలస్నానం చేసే ముందు తప్పకుండా జొజొబా, ఆలివ్, కొబ్బరినూనెలతో మర్దన చేసుకోవాలి. తర్వాత కండిషనింగ్ చేసుకోవాలి. అలాగే కెమికల్స్, ఆల్కహాల్ లేని హెయిర్ ప్రాడక్ట్స్ ఉపయోగించాలి. హెన్నా, కలరింగ్ ఉత్పత్తులనూ ఎక్కువగా వాడొద్దు. అలాగే వారానికోసారి హెయిర్ మాస్క్‌ని వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
మాస్క్ ఇలా తయారు చేసుకోండి..