Tips to Build Strong Relationship :రొమాంటిక్ లైఫ్ ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ.. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది మాత్రం చాలా మందికి తెలియదు. మెజారిటీ జనానికి తెలిసిన రొమాన్స్ మీనింగ్ కామం మాత్రమే. కానీ.. కామం (Lust) వేరు, రొమాన్స్ (Romance) వేరు! రొమాన్స్ అంటే.. ప్రేమగా మాట్లాడడం కావొచ్చు.. హగ్ చేసుకోవడం కావొచ్చు.. ఓ ముద్దు పెట్టుకోవడం కావొచ్చు.. చేతిలో చేయి వేసి దగ్గరికి తీసుకోవడం అవ్వొచ్చు. ఒకరికొకరు తినిపించుకోవడం కూడా అవ్వొచ్చు.. సరదాగా నవ్వుతూ ఉండడం కావొచ్చు.. ఇలాంటివన్నీ రొమాన్స్ కిందకే వస్తాయి. మీ లైఫ్ కూడా ఇలాగే సాగిపోవాలంటే.. కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటోఈ స్టోరీలో చూద్దాం..
టైం స్పెండ్ చేయండి:ఉద్యోగం, బాధ్యతలు, పిల్లల పెంపకం.. ఇవన్నీ ఎంత ముఖ్యమో.. భార్యాభర్తలుగా మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడమూ అంతే ముఖ్యం. ఎంత పని ఉన్నా.. జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాల్సిందే. ఇందుకోసం రోజులో కాస్త టైమ్ పెట్టుకోండి. ఇద్దరు కూర్చుని ఆ రోజు అనుభవాలను పంచుకోండి. కలిసి డిన్నర్ చేయడం, లేదా వాకింగ్‌కు వెళ్లడం, వీకెండ్ బయటికి వెళ్లడం వంటివి చేస్తే.. ఆటోమేటిక్‌గా టైం దొరుకుతుంది. లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలన్నా.. మీ ప్రేమ ఎల్లకాలం పరిమిళించాలన్నా.. ఇది చాలా అవసరం.
ఇవి ఒంటరి తనానికి సంకేతాలు - ముదిరితే భార్యాభర్తల బంధానికి బీటలే!
సర్ప్రైజ్ :మీ భాగస్వామిని అప్పుడప్పుడూ సర్ప్రైజ్ చేయండి. పార్టీ ప్లాన్ చేయడమో, గిఫ్ట్స్ ఇవ్వడమో.. చెప్పకుండా నచ్చిన చోటికి తీసుకెళ్లడమో.. ఇలాంటివి చేయండి. అప్పుడు మీరు తన గురించి పట్టించుకుంటున్నారనే విషయం వారికి అర్థమవుతుంది. అది చాలా సంతోషానిస్తుంది. సర్ప్రైజ్ అంటే ఖరీదైన గిఫ్ట్సే కానవసరం లేదు.. వారికి తెలియకుండా వారికి నచ్చిన కర్రీ వడడం, చక్కటి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం కూడా సర్ఫ్రైజే అన్నది మరవొద్దు.
ఓపెన్ కమ్యూనికేషన్:దాంపత్యంలో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. మీకు, మీ భాగస్వామికి మధ్య దాపరికాలు ఉండకూడదు. మీ ఆలోచనలు, కలలు, భయాలు.. అన్నీ పంచుకోండి. సీక్రెట్స్ లేని బంధం రాక్ సాలిడ్‌గా ఉంటుంది. కాబట్టి.. అన్ని విషయాలనూ ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చర్చించుకోండి. ఇలా ఉండడం వల్ల.. మీ భాగస్వామి మానసికంగా మీకు ఎంతో దగ్గరవుతారు. మీ బంధాన్ని విడిచి ఉండలేనంతగా కలిసిపోతారు.
చెప్పేది వినండి:మీ బంధానికి కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో.. అవతలి వారు చెప్పేది వినడం కూడా ముఖ్యమే. చాలా మంది వాళ్ల పార్టనర్ ఏం చెబుతున్నారో వినడానికి ఇంట్రెస్ట్ చూపరు. తనకేం తెలుసు? అంటూ.. లైట్ తీసుకుంటారు. దీనివల్ల మీరు వారిని చులకనగా చూస్తున్నారనే ఫీలింగ్ ఏర్పడుతుంది. కాబట్టి.. అలా చేయకండి. మీ భాగస్వామి ఏం చెప్పాలనుకుంటున్నారో.. శ్రద్ధగా, పూర్తిగా వినండి. దీనివల్ల.. వారు చెప్పేదానిపై మీరు ఆసక్తి చూపుతున్నారని హ్యాపీగా ఫీలవుతారు. మీ బంధాన్ని ఇది ధృడంగా మారుస్తుంది.