Tips For Exercise Beginners :అమ్మాయిలతా నాజూకు అందంతో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అబ్బాయిలు సిక్స్‌ప్యాక్ బాడీ కావాలని ఆరాటపడతారు. అందరూ ఆశతోనే ఆగిపోతే.. కొందరు జిమ్‌లో కష్టపడుతుంటారు. వీళ్లు కూడా కొన్నాళ్ల తర్వాత మధ్యలోనే వదిలేస్తారు. వ్యాయామాలు చేయడం, జిమ్‌కు వెళ్లడం వంటివన్నీ ఆపేస్తుంటారు. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.
అయితే.. కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ సంగీత అంకత (కాస్మొటిక్ యోగ థెరపిస్ట్). ఈ టిప్స్ పాటించడం వల్ల రోజూ వ్యాయామం కంటిన్యూ చేయొచ్చని అంటున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
తగినంత నిద్ర :
వ్యాయామం కొనసాగించలేకపోవడానికి ప్రధాన కారణం.. ఉదయం నిద్రలేవలేకపోవడం. పొద్దున్నే లేవాలని, వర్కౌట్స్ చేయాలని కోరికగా ఉంటుందిగానీ.. సమయానికి లేవలేరు. ఈ కారణంగానే.. కొన్నాళ్లు చేసి మానేస్తుంటారు. ఇలాంటివారు చేయాల్సిన మొదటి పని.. కంటి నిండా నిద్రపోవడమని చెబుతున్నారు సంగీత. సరిపడా నిద్రపోయిన వారు ఉదయాన్నే లేవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
9 గంటలకు బెడ్ ఎక్కాల్సిందే..
మీకు నిద్ర సరిపోవాలంటే.. త్వరగా బెడ్ ఎక్కాలి. అప్పుడే కావాల్సినంత నిద్రపోతారు. ఉదయం తాజాగా మేల్కొంటారు. దీనికోసం రాత్రి 9 గంటలకల్లా పనులన్నీ ముగించుకొని బెడ్ మీదకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీరు ఉదయం 5 గంటలకు మేల్కొన్నప్పటికీ.. 8 గంటలు నిద్రపోయి ఉంటారు! కాబట్టి.. కంటి నిండా నిద్రపోయినట్టే!
అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఏం తినాలో? ఏం తినకూడదో తెలుసుకోండి! - Stomach Ulcer Diet
ఫోన్ పక్కన పెట్టాలి..
చాలా మంది అనుకున్న సమయానికి బెడ్ ఎక్కినప్పటికీ నిద్రపోరు. బెడ్ మీద పడుకొని ఫోన్ పట్టుకుంటారు. ఇది ఏమాత్రమూ మంచిది కాదని చెబుతున్నారు. పడకగదిలో ఫోన్ చూసేవారు ఎప్పుడు నిద్రపోతారో వాళ్లకే తెలియదు. పైగా.. రాత్రివేళ ఫోన్ చూసీ చూసీ కళ్లు అలసిపోతాయి. ఫలితంగా ఉదయాన్నే ఎప్పుడో లేస్తారు. దీంతో.. వేసుకున్న ప్లాన్ మొదలు, వ్యాయామం వరకూ అన్నీ పక్కకుపోతాయి. అందుకే.. బెడ్ రూమ్‌లోకి వెళ్లగానే ఫోన్ పక్కన పెట్టేయాలని చెబుతున్నారు.
ఒక పండు తినాలి..
ఉదయాన్నే జాగింగ్‌కు వెళ్లేవారు లేదా వర్కౌట్స్ చేసేవారు ఎటువంటి ఆహారం తీసుకోకుండానే వెళ్తుంటారు. అయితే.. ఇలా ఏ ఆహారమూ తీసుకోకపోవడం వల్ల తొందరగా అలసిపోయే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి, ఎక్సర్‌సైజ్‌లు చేసే 15 నిమిషాల ముందు ఏదైనా ఒక పండు తినాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వర్కౌట్ చేసే సమయంలో ఎనర్జీ వస్తుందని, ఉత్సాహంగా ఉంటారని సూచిస్తున్నారు.
అలర్ట్ : సాయంత్రం పూట టీ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తాగకూడదట! - Tea Side Effects
వర్కౌట్ తర్వాత..
వ్యాయామం చేసిన అరగంట తర్వాత మంచి ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. శరీరానికి సహజ సిద్ధంగా ప్రొటీన్ అందడానికి రెండు లేదా మూడు ఎగ్‌వైట్స్, ఒక గుడ్డు పచ్చసొన తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లీవ్ పెట్టొద్దు..
సెలవు రోజున డ్యూటీకి వెళ్లకుండా ఉన్నట్టే.. వ్యాయామానికి కూడా సెలవు ప్రకటిస్తుంటారు చాలా మంది. ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఏదైనా సరే.. మీరు ఎక్కడ ఉన్నా సరే.. వ్యాయామం మాత్రం ఆపకూడదని, పొద్దున్నే రోజూ నిద్రలేచే సమయానికే లేవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుందని సూచిస్తున్నారు. ఇక, కొత్తగా చేసే వారు తొలిరోజుల్లో 20 నిమిషాల పాటు వర్కవుట్స్ చేస్తే చాలని చెబుతున్నారు. అలా.. టైమ్‌ను పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ చేస్తే.. మీరు మధ్యలో వదిలేసే పరిస్థితే రాదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడట్లేదా? - ఇలా ఇచ్చారంటే గ్లాస్ ఖాళీ చేసేస్తారు! - How To Make Children To Drink Milk