These Vegetables Have More Protein Than Eggs: మనం హెల్దీగా ఉండడానికి కావాల్సిన పోషక పదార్థాలలో ప్రొటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే బాడీలో ఎముకలు, కండరాలు బలంగా ఉండాలంటే ప్రొటీన్ తీసుకోవాలి. అంతేకాదు రక్తం పెరుగుదలకు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్ చాలా అవసరం. మొత్తంగా శరీరం శక్తివంతంగా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత ప్రొటీన్ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ క్రమంలో చాలా మంది అధిక ప్రొటీన్ కంటెంట్ అనగానే.. ఎక్కువగా గుడ్లు(Eggs), మాంసాహారం తీసుకుంటుంటారు. కానీ, ప్రొటీన్ కంటెంట్ గుడ్ల కంటే ఎక్కువగా ఉండే కొన్ని కూరగాయలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే.. ఈ కూరగాయల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎగ్స్ అంటే నచ్చని వారు, మాంసాహారం తినని వాళ్లు వీటిని తిన్నారంటే ప్రొటీన్‌తో పాటు ఇతర ఆరోగ్యకరమైన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇంతకీ ఆ ప్రొటీన్ రిచ్ వెజిటబుల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాలీఫ్లవర్ :కాలీఫ్లవర్, బ్రోకలీలు.. గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. కాలీఫ్లవర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కాలీఫ్లవర్‌లో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ కె, విటమిన్ సి వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
పచ్చి బఠానీలు :గుడ్ల కంటే అధిక ప్రొటీన్ కంటెంట్ కలిగిన మరో గ్రీన్ వెజిటబుల్ ఏంటంటే.. పచ్చి బఠానీలు. వీటిలో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలతో చేసే ఏ వంటకాలైనా చాలా రుచిగా ఉంటాయి. ఈ బఠానీలలో ఎక్కువ ప్రొటీన్ కంటెంట్‌తో పాటు మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, ఫోలేట్, జింక్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని చిన్న పోషకాల పవర్ హౌస్ అని కూడా అంటారు. అదేవిధంగా ఈ పచ్చి బఠానీలలో ఉండే ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్‌లు.. పెద్దపేగు క్యాన్సర్‌ను నిరోధించగలవని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
వైట్ ఎగ్స్ Vs బ్రౌన్ ఎగ్స్- ఏవి ఆరోగ్యానికి బెస్ట్? ఎందులో పోషకాలు ఎక్కువ?