These Fruits not to Preserve in Fridge :ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పటికప్పుడు మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చుకొని తినడం అంత తేలికైన పని కాదు. అందుకే.. చాలా మంది వీకెండ్ టైమ్‌లో మార్కెట్‌కు వెళ్లినప్పుడు కావాల్సిన వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటుంటారు. ఇక సమ్మర్లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. వేసవిలో పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతాయని.. ఇంటికి తీసుకురాగానే రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తుంటారు. అయితే, కొన్ని పండ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో(Fridge) నిల్వ చేయవద్దంటున్నారు నిపుణులు. అలా ఉంచడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉండడమేమో గానీ.. త్వరగా పాడవుతాయట. అంతేకాదు.. రుచిని కోల్పోయి విషపూరితంగా మారవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఫ్రిజ్‌లో ఏ పండ్లను ఉంచకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుచ్చకాయ : సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా చెప్పుకునే పుచ్చకాయను చాలా మంది కూల్‌గా తినాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఈ పండు పెద్దదిగా ఉండడంతో దాన్ని కోసి ముక్కలను రిఫ్రిజిరేటర్లో ఉంచుతుంటారు. కానీ, ఎప్పుడు కూడా పుచ్చకాయ, దాని ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా ఉంచడంలో వల్ల దానిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు నశిస్తాయంటున్నారు.
2012లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ ముక్కల కంటే.. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన ముక్కలలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని టెక్నాలజికల్ యూనివర్శిటీ ఆఫ్ డాల్మేషియాకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్. జువాన్ పాబ్లో కాస్ట్రో-పాలోమో పాల్గొన్నారు. ఫ్రిజ్‌లో పుచ్చకాయ ముక్కల స్టోర్ చేయడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు.
మామిడి పండ్లు :వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లను చాలా మంది ఎక్కువ మొత్తంలో కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని తింటుంటారు. కానీ, వీటి ఎప్పుడూ రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది అందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయట. అంతేకాదు త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
అరటిపండ్లు : మీరు ఫ్రిజ్‌లో ఉంచకూడని మరో పండు.. అరటి. ఎందుకంటే వీటిలో రిఫ్రిజిరేటర్లో ఉంచితే చాలా త్వరగా నల్లగా మారి పాడవుతాయంటున్నారు నిపుణులు. అలాగే ఈ పండ్ల కాండం నుంచి ఇథిలీన్ వాయువు రిలీజ్ కావడం వల్ల త్వరగా పండుతాయంటున్నారు. కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది అంటున్నారు నిపుణులు.
వేసవిలో ఫ్రిజ్ నీళ్లు తాగితే - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?