What are the Foods To Avoid in Breakfast: మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అందులోనూ బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఉదయాన్నే ఏం తింటామో అది ఆ రోజు మొత్తం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దని, హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే.. ఉదయాన్నే అన్ని రకాల ఆహార పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. అవి తీసుకోవడం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇంతకీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షుగరీ సిరిల్స్ :మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీపిగా ఉండేటువంటి తృణధాన్యాలను(షుగరీ సిరిల్స్) అస్సలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిలో అధిక మొత్తంలో ఉండే చక్కెర స్థాయులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం(Diabetes) వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
ప్రాసెస్డ్ మాంసాహారం :మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలలో మరొకటి.. ప్రాసెస్డ్ మాంసాహారం. ఎందుకంటే.. ఈ ఫుడ్‌లో శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల బాడీలో చెడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.
బ్రేక్ ఫాస్ట్‌కు సరైన ముహూర్తం ఇదే - దాటితే గుండెపోటు గండం!
పండ్ల రసాలు : ఇవి ఆరోగ్యకరమైనప్పటికీ మార్నింగ్ పరగడపున తీసుకుంటే మాత్రం అనారోగ్యాలను తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయులు అదుపులో ఉండాలంటే పండ్ల రసాలను ఖాళీ పొట్టతో అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా మలబద్ధకం, అసిడిటీ, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి, మార్నింగ్ వీలైనంత వరకు పండ్ల రసాలకు దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.