Summer Hydration Tips :వేసవి కాలంలో ఓ వైపు ఎండవేడి, వడగాలులు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరొకవైపు చెమట చిరాకు పెడుతుంది. అయితే.. ఈ సమస్య కొంత మందిలో ఎక్కువగా ఉంటుంది. ఇలా అధికంగా చెమట రావడానికి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, మెనోపాజ్.. వంటి వివిధ కారణాలుంటాయట. అయితే, చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోవడం మంచిదేనని నిపుణులంటున్నారు. కానీ, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చంకల్లో చెమట తగ్గడానికి :
కొంతమందికి చంకల్లో ఎక్కువగా చెమట పట్టడంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఈ సమస్యకు ఒక చిన్న చిట్కాతో చెక్ పెట్టవచ్చని నిపుణులంటున్నారు. అదేంటంటే.. కొద్దిగా కార్న్‌స్టార్చ్‌లో కాస్త బేకింగ్ సోడా వేసి సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్‌లాగా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చంకల్లో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల కొద్ది రోజుల్లో చెమట సమస్య నుంచి విముక్తి పొందచ్చని నిపుణులంటున్నారు.
ఈ జ్యూస్‌లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి!
ఎక్కువగా చెమట సమస్యతో బాధపడేవారు బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి.. ఎన్నో ఔషధ గుణాలున్న గోధుమగడ్డి జ్యూసు, టొమాటో రసం తాగాలి. ఇందులో సి, బి6, బి12 వంటి విటమిన్లు, ఫోలికామ్లం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌లు మనకు వేసవిలో ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.