Stress Relief Techniques:ప్రస్తుత ఆధునిక సమాజంలో అనారోగ్య సమస్యలు లేనివారు ఉన్నారేమో గానీ, మానసిక సమస్యలతో బాధపడేవారు మాత్రం లెక్కకు మించి ఉంటారు. పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని, చదివింది గుర్తుండడం లేదని ఒత్తిడికి లోనైతే.. పెద్దలు కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి వల్ల విపరీతమైన స్ట్రెస్ అనుభవిస్తుంటారు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. దీనినే 'బర్న్ అవుట్' అంటారు. అయితే.. మనిషికి కొద్దిపాటి ఒత్తిడి ఉండడం మంచిదే! ఎందుకంటే దీనివల్ల చేయాల్సిన పనులను త్వరగా చేస్తారు. కానీ, సమస్యంతా విపరీతమైన ఒత్తిడితోనేనని నిపుణులు చెబుతున్నారు. నిత్యజీవితంలో ఒత్తిడిని జయించడానికి 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) మంత్రాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటీ RRR రూల్ ? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
రికగ్నైజ్ (Recognize) - గుర్తించటం :మొదట మీరు ఏయే సందర్భాల్లో విపరీతమైన స్ట్రెస్‌కి గురవుతున్నారో గుర్తించమంటున్నారు. అసలు ఒత్తిడికి గల కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుంటే.. దీనికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. తర్వాత మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలని... ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2020లో 'జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. Recognize, Reverse, Resilience (RRR)- ఆధారిత ప్రోగ్రామ్ స్ట్రెస్‌ను తగ్గించిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటాలోని మయో క్లినిక్‌లో ప్రొఫెసర్ 'డాక్టర్ Colin P. West' పాల్గొన్నారు.
రివర్స్ (Reverse) -వెనక్కి తిప్పటం:ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నామో ముందుగా గుర్తిస్తే.. దాని నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించవచ్చంటున్నారు. ఒకవేళ ఇలా గుర్తించలేనప్పుడు మరొలా ప్రయత్నించవచ్చని సలహా ఇస్తున్నారు. విపరీతమైన ఒత్తిడికి మనం తీవ్రంగా ఆలోచించడం ఒక కారణంగా నిపుణులు చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ ఆలోచనలను తగ్గించుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
దీనికి సంబంధించి ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వర్క్ ఇన్‌టైమ్‌లో కంప్లీట్ చేయలేమోనని లేదా ఒక సబ్జెక్టులో మంచి మార్కులు సాధించలేమోననే ఆలోచనలు పదేపదే వస్తున్నాయనుకుందాం. ఇలాంటప్పుడు అదే ప్రాజెక్టు లేదా సబ్జెక్టుపై పట్టుసాధించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దిశగా ఆలోచించడం మొదలు పెట్టాలంటున్నారు. విద్యార్థులైతే తమ టీచర్లను సబ్జెక్టులో డౌట్లను అడిగి సాల్వ్ చేసుకోవాలా, ట్యూషన్‌కు వెళ్లాలా.. లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. ఇలా వివిధ కోణాల్లో ఆలోచించాలని సూచిస్తున్నాకు. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల స్ట్రెస్ మరింత పెరుగుతుంది తప్పా ఫలితం ఉండదు. కాబట్టి సమస్య గురించి ఆలోచించకుండా.. సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఆలోచించాలని అంటున్నారు.
రెసీలియెన్స్ (Resilience)-పూర్వస్థితికి రావటం :ఒత్తిడిని (నేషనల్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ రిపోర్ట్) అనుభవిస్తున్నప్పుడు వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలని సూచిస్తున్నారు. అయితే, ఇక్కడ ఎంత త్వరగా, తేలిగ్గా ఒత్తిడిని జయిస్తున్నామన్నది ముఖ్యం కాదు. దాన్ని నివారించి పూర్వపు స్థితికి రావడమే ప్రధానం. అయితే, ఒత్తిడికి గల కారణాలను గుర్తించడం, శ్వాస వ్యాయామాలు చేయడం వంటివి పూర్వపు స్థితికి తీసుకొస్తాయని చెబుతున్నారు